"పవన్ కల్యాణ్ సభకు షాక్.. అనుమతి నిరాకరించిన తెలంగాణ పోలీసులు"|

0
405

హైదరాబాద్ : ఏపి. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్  హైదరాబాద్ లో  నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’కు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో జూన్ 2న ఈ సభను నిర్వహించేందుకు జనసేన పార్టీ ఏర్పాట్లు చేపట్టగా, భద్రతా కారణాలను చూపుతూ పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం.

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో జరగనున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మొత్తం ఆ వేడుకల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉందని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

అదే రోజు పెద్ద ఎత్తున రాజకీయ సభ నిర్వహిస్తే ట్రాఫిక్ రద్దీతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అభిప్రాయపడిన అధికారులు సభకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేన నాయకత్వం న్యాయపోరాటానికి సిద్ధమైంది. సభ నిర్వహణకు అనుమతి కల్పించాలని కోరుతూ పార్టీ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణలో పార్టీ విస్తరణ లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నామని జనసేన వర్గాలు చెబుతుండగా, ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

ఇప్పుడు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

#sidhumaroju

Search
Categories
Read More
Puducherry
Puducherry Invites Partners for AI Center of Excellence
The Government of Puducherry, through its Department of Information Technology, has officially...
By Lokeshwari Panthadi 2026-06-30 10:43:51 0 95
Andhra Pradesh
శ్రీకాకుళం: నేడు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొండపల్లి రాక
నేడు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొండపల్లి రాక సందర్భంగా, ఎస్పీ మరియు ఇతర అధికారుల సమావేశంలో...
By Manda Ramkumar 2026-03-30 01:09:53 0 514
Andhra Pradesh
ప్రేమ వ్యవహారంలో పగ పెంచుకుని యువకుడి హత్య.. చీరాలలో దారుణ ఘటన ఐదుగురు నిందితుల అరెస్ట్
చీరాల:  చీరాల పట్టణంలోని రైల్వే ట్రాక్ పక్కన, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన దారుణ...
By Gadiyapudi Narendra 2026-02-04 16:28:10 0 217
Andhra Pradesh
పీపీపీ వైద్యంపై రాజకీయ యుద్ధం
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఒక రాజకీయ యుద్ధ క్షేత్రాన్ని...
By John Baji 2025-12-25 05:08:54 0 312
Telangana
నిజామాబాద్: రఘునాథాలయ పరిసర ప్రాంతాల అధికారులు సందర్శన
నగరంలోని రఘునాథాలయం ఖిలా రామ మందిరంలో ఆలయ పరిసర ప్రాంతాలు అధికారులు పరిశీలించారని కమిటీ సభ్యులు...
By Sadaq Sadaq 2026-03-15 17:08:31 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com