"సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పోలీసులు.|

0
384

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాలయం రైల్వే క్వార్టర్స్ వద్ద సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. 

ఈ సందర్భంగా సైబర్ నేరస్తులు అమాయక ప్రజలను మోసగించేందుకు అనుసరిస్తున్న పలు విధానాల గురించి వివరించి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.

గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, వీడియో కాల్స్ లేదా ఇతర అనుమానాస్పద సందేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచించారు. 

అలాగే వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు వంటి గోప్యమైన సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని హెచ్చరించారు. 

డబ్బులను ఇతరులకు బదిలీ చేసే ముందు పూర్తిగా నిర్ధారించుకోవాలని, మోసపూరిత మాటలను నమ్మి ఆర్థిక లావాదేవీలు చేయవద్దని సూచించారు.

ఒకవేళ సైబర్ నేరానికి గురైనట్లయితే వెంటనే గోల్డెన్ అవర్‌లో 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. ఫిర్యాదు అందిన వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపిస్తారని తెలిపారు. 

అనంతరం బాధితుడి పూర్తి వివరాలను సేకరించి, మోసపోయిన డబ్బులు సంబంధిత ఖాతాల్లో హోల్డ్‌లో ఉన్నట్లయితే కోర్టు ప్రక్రియ ద్వారా తిరిగి పొందే అవకాశం ఉంటుందని వివరించారు.

సైబర్ నేరస్తుల మోసపూరిత హామీలు, ఆకర్షణీయమైన ఆఫర్లు, నకిలీ కాల్స్‌ను నమ్మవద్దని, సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో చిలుకలగూడ ఏసీపీ కె. శశాంక్ రెడ్డి, లాలాగూడ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్, ఎస్సై రామేశ్వర్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
సుల్తానాబాద్ : ఎలిగేడు లో వడదెబ్బతో రైతు మృతి..!
ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి వడదెబ్బతో మృతి చెందాడు. కుడుము సభ్యులు...
By Sunka Santhosh 2026-04-29 17:04:45 0 214
Andhra Pradesh
నిమ్మల పల్లెలో ఘటన 12 మందిపై కేసు.
నిమ్మనపల్లె మండలం దిన్నిమీద జంగంపల్లిలో చింత చెట్ల నరికివేత విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై...
By Pagadala Venkateswar 2026-01-29 06:12:44 0 213
Telangana
అయోధ్య రామ మందిర విరాళాల అక్రమాల కేసులో కీలక పురోగతి.. 150 మంది అనుమానితుల గుర్తింపు.|
హైదరాబాద్ : అయోధ్య రామ మందిరంలో విరాళాల అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తులో ప్రత్యేక...
By Sidhu Maroju 2026-06-23 08:49:00 0 188
SURAKSHA
Targeting Networks: Chhattisgarh’s War on Drug Cartels
The Chhattisgarh Police have taken a highly decisive stand against narcotics by aggressively...
By Lokeshwari Panthadi 2026-07-04 10:37:49 0 206
Andhra Pradesh
పుంగనూరు మోడల్ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభం
పుంగనూరు పరిధిలోని అడవినాథుని కుంట ఏపీ మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బుధవారం...
By Kothuru Murali 2026-06-10 13:31:04 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com