క్రమశిక్షణ గల పార్టీ టిడిపి అని నిరూపితమైంది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
*క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ అని నిరూపితమైంది*
*హైబ్రీడ్ మహానాడును విజయవంతం చేసిన క్టస్లర్ ఇన్‌చార్జ్‌లను అభినందించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్*
*ఎస్‌ఐఆర్(సర్)పై ఆందోళన చెందాల్సిన పనిలేదు*
*++++*
హైబ్రీడ్ విధానంలో జరిగిన మహానాడును పూర్తి స్థాయిలో విజయవంతం చేసి టీడీపీ అంటే క్రమశిక్షణ గల పార్టీ అని టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరూపించారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.
ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడును హైబ్రీడ్ విధానంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11 చోట్ల నిర్వహించి విజయవంతం చేసిన నియోజకవర్గంలోని క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. మొదటి సారిగా హైబ్రీడ్ విధానంలో నిర్వహించిన మహానాడును విజయవంతం చేసిన నాయకులకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ మొదటి సారిగా హైబ్రీడ్ విధానంలో నిర్వహించిన మహానాడును ఘనంగా నిర్వహించి క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ అని నాయకులు, కార్యకర్తలు నిరూపించారని కొనియాడారు. ఈ మహానాడు నిర్వహణ దేశంలోనే ఒక ప్రత్యేకత అని, ఒక ప్రాంతీయ పార్టీ ఈ విధంగా నిర్వహించడం రికార్డుగా నమోదు అవుతుందని అభిప్రాయపడ్డారు.గతంలో మహానాడుకు వివిధ ప్రాంతాల నుంచి భౌతికంగా హాజరయ్యే సంఖ్య కంటే అధికంగా ఈ హైబ్రీడ్ మహానాడులో 20 లక్షలకు పైగా నాయకులు, కార్యకర్తలు పాల్గొని చరిత్ర సృష్టించారని వివరించారు. మహానాడు వేదికగా వివిధ అంశాలపై నాయకులు చర్చించి పలు అంశాలపై తీర్మానాలు చేశారని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు తమ అభిప్రాయాలను ఈ మహానాడు ద్వారా పార్టీ అగ్రనాయకత్వానికి స్వయంగా తెలియజేశారని తెలిపారు.
రాష్ట్రంలో జరగనున్న సర్ ప్రక్రియపై ఆందోళన అవసరం లేదని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ఓటర్ల జాబితా సవరణలో సర్ (ఎస్‌ఐఆర్) అనే ప్రక్రీయ చాలా కీలకమని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఈ సర్ కార్యక్రమానికి భయపడుతున్నాయని, దేశవ్యాప్తంగా గతంలో 10 సార్లు జరిగిందని, ఓటర్లు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని వివరించారు. 20 సంవత్సరాలుగా మరణించిన వారు, వివిధ కారణాలపై మరో ప్రాంతానికి వెళ్ళిన వారి పేర్లు నేటికీ ఓటరు జాబితాలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ బి.ఎల్.ఓ.లు మరియు పార్టీలకు చెందిన బి.ఎల్.ఎ.లు ప్రతి ఇంటికి వచ్చి ఓటర్ల వివరాలు సేకరిస్తారని తెలిపారు. వారికి సహకరించి, వోటును నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఓట్లు తొలగిస్తారని వైఎస్సార్‌సీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే సర్ ప్రక్రియన ఉద్దేశ్యమని ఉద్ఘాటించారు. సర్ కార్యక్రమంతో భయాందోళనలు చెందవద్దని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో ముమ్మనేని ప్రసాద్, పేరేపి ఈశ్వర్, దోమకొండ రవి, గుమ్మడి గురుప్రసాద్, సొంగా సంజయ్ వర్మ, పొట్లూరి సాయిబాబు, షేక్ ఫిరోజ్, రత్నం రమేష్, తలపాటి ప్రసాద్, గొరిపర్తి నామేశ్వరరావు, మాదాల రాజ్యలక్ష్మి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz