విధులలో నిర్లక్ష్యం షోకాజ్ నోటీసులు జారీ

0
1K

మహబూబాబాద్ మే 7 : గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల నిర్వహణలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో నిర్లక్ష్యం జరిగిన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ సంబంధిత ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో విధులు సక్రమంగా నిర్వహించని స్థానిక వైద్యులు, సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, విధుల పట్ల నిర్లక్ష్యం ఏ స్థాయిలోనైనా సహించబోమని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు. ఆసుపత్రులలో సమయపాలన, రోగులకు మర్యాదపూర్వక సేవలు, మందుల లభ్యత, పరిశుభ్రత వంటి అంశాలలో ఎటువంటి అలసత్వం చూపరాదని, ఉప కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని హెచ్చరించారు. విధి నిర్వహణలో అలక్ష్యం చేసిన సిబ్బందిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని డాక్టర్ రవి రాథోడ్ తెలిపారు.

Search
Categories
Read More
Telangana
అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు : దర్శించుకున్న ఎమ్మెల్యే
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సూర్యనగర్ కాలనీ...
By Sidhu Maroju 2025-09-24 09:37:48 0 341
Andhra Pradesh
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం చంద్రబాబు లేఖ.
మొక్కజొన్న కనీస మద్దతు ధర కంటే భారీగా పడిపోయిన మార్కెట్ ధరలు ధరల వ్యత్యాస చెల్లింపుల పథకాన్ని...
By Pagadala Venkateswar 2026-04-28 05:09:03 0 130
Andhra Pradesh
అనంత:సురక్ష వాహనం ద్వార సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, డ్రగ్ పై సురక్ష వాహనం ద్వారా అవగాహన సదస్సులు
అనంతపురం: ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా సురక్ష వాహనం ద్వారా అవగాహన...
By Eslavath RameshNaik 2026-01-14 05:43:51 0 430
Andhra Pradesh
పేరాల లో వైభవంగా శ్రీ బద్రావతి సమేత భావనరుషి స్వామి రథోత్సవం
చీరాల: పేరాల లో వైభవంగా శ్రీ బద్రావతి సమేత భావనరుషి స్వామి రథోత్సవం ముఖ్యఅతిథిగా పాల్గొన్న...
By Gadiyapudi Narendra 2026-01-19 14:23:05 0 215
SURAKSHA
Pillar of Integrity: Shri L. Khiangte's IAS Journey
From Tribal Roots to the State's Highest Administrative Office: How a Veteran Bureaucrat Mastered...
By Kalaga Sailaja 2026-07-31 11:02:24 0 614
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com