హైదరాబాద్ మెట్రో రైల్‌ను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేసింది?

0
155

మెట్రో మొదటి దశలో 69 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను సుమారు రూ.22వేల కోట్లతో పీపీపీ పద్ధతిలో నిర్మించారు. 2017 నవంబరు నుంచి మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది.

‎అయితే, రెండో ఫేజ్ నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే, ఇప్పటివరకు ఉన్న ఫేజ్ ప్రైవేటు అధీనంలో ఉండగా.. దానికి అనుసంధానంగా నిర్మించే కారిడార్లు ప్రభుత్వ అధీనంలో నిర్మిస్తే నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందని 2026 మార్చి 29న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు

‎క్రమంలో మెట్రో రైల్ మొదటి ఫేజ్ నెట్‌వర్క్‌ను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు.

‎మెట్రో స్వాధీనానికి సంబంధించిన వివరాలను హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ బీబీసీతో పంచుకున్నారు.

‎'మెట్రో రైల్ మొదటి ఫేజ్ కన్సెషన్ అగ్రిమెంట్. ఇది అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఎల్ అండ్ టీ మధ్య జరిగింది. రెండో ఫేజ్ నిర్మాణం మాత్రం కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉంది. ప్రస్తుత కారిడార్లను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు ఆప్షన్లు సూచించింది'' అని చెప్పారు.

‎ఎల్బీనగర్-మియాపూర్ కారిడార్, నాగోలు-రాయదుర్గం కారిడార్‌లను విస్తరించాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతం ఆ రెండు కారిడార్లు ఎల్ అండ్ టీ నిర్వహణలో ఉన్నాయి. దీంతో విస్తరించే భాగానికి సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే వీలుంది. అంటే ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్‌కు విస్తరించినప్పుడు రెండు యాజమాన్యాల పరిధిలో నిర్వహణ ఉంటే రైళ్లు ఆపరేట్ చేయడం, ఫ్రీక్వెన్సీ, కరెంటు ఖర్చులు.. ఇలా చాలా సవాళ్లు ఎదురయ్యే వీలుంది'' అని సర్ఫరాజ్ అహ్మద్ బీబీసీతో చెప్పారు.

‎దీనివల్ల గమ్యస్థానం చేరాలంటే ఒకే కారిడార్‌లో ఒక రైలు దిగి మరో రైలు ఎక్కాలి లేదా ఎల్‌అండ్‌టీతో డెఫినిటివ్ అగ్రిమెంట్ చేసుకోవాలి అని రెండు ఆప్షన్లను కేంద్ర ప్రభుత్వం సూచించిందని అధికారులు చెబుతున్నారు.

‎తెలంగాణ ప్రభుత్వం ఒకే రైలులోనే పూర్తి దూరం ప్రయాణించేలా డీపీఆర్ సిద్ధం చేసింది.

‎'డెఫినిటివ్ అగ్రిమెంట్ కంటే కూడా తమ వాటాను పూర్తిగా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎల్‌అండ్‌టీ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తే విక్రయిస్తామంది. ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వమే ఎల్‌అండ్‌టీ నుంచి ఈక్విటీని కొనుగోలు చేసింది'' అని సర్ఫరాజ్ అహ్మద్ బీబీసీతో చెప్పారు.

‎దీనివల్ల రెండో ఫేజ్ నిర్మాణ పనులు సులువుకానున్నాయని వివరించారు.

‎2072 వరకు మొదటి ఫేజ్ నిర్వహణకు అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వానికి తన వాటాను ఎల్‌అండ్‌టీ విక్రయించింది.

‎ఎలాంటి ఆటంకం లేకుండా భవిష్యత్తులో మెట్రో కారిడార్లు విస్తరించేందుకు వీలుంటుంది. అన్ని ఫేజ్‌ల పరంగా ఒకే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆర్థికపరంగా, నిర్వహణ పరంగా మరింత సమర్థంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది'' అని మెట్రో మొదటి దశ స్వాధీనం అగ్రిమెంట్ పూర్తయ్యాక హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.

Search
Categories
Read More
Andhra Pradesh
కేజీబీవీ విద్యార్థుల విజయభేరి
నందవరం మండల కేంద్రం ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ 40 మంది విద్యార్థులకు పరీక్షలు రాయగా 39...
By Boya Dasthagiri 2026-04-15 08:41:24 0 207
Andhra Pradesh
ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్.
    ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్...
By Pagadala Venkateswar 2026-05-15 06:19:25 0 140
Telangana
"మహిళా బిల్లుపై రగిలిన ఆగ్రహం… రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం అల్వాల్‌లో ఉద్రిక్తత”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలతో అల్వాల్ ఐజి సర్కిల్ పరిధిలో...
By Sidhu Maroju 2026-04-18 10:12:02 0 375
Andhra Pradesh
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయ్యప్ప స్వామి కిప్రత్యేక పూజలు
పుంగనూరు: శ్ ర ీ కోటమల ై అయ్యప్ ప స్వామి ఆలయంల ో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పెద్దిరెడ...
By Kothuru Murali 2025-12-27 17:31:46 0 251
Andhra Pradesh
ఏమాత్రం పట్టించుకోలేని విద్యాధికారులు
ఆదోని పట్టణంలో ఉన్నటువంటి భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. DSF,...
By Boya Dasthagiri 2026-05-01 13:55:27 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com