"సీపీ సుమతి బాధ్యతల స్వీకారం… సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై కఠిన చర్యలు.|

0
569

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి బి. సుమతి శుక్రవారం తన పదవిని చేపట్టి, భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా స్పష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. 

బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆమెకు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, మల్కాజిగిరి మొదటి మహిళా పోలీస్ కమిషనర్‌గా నియమితులవడం తనకు గౌరవం మాత్రమే కాకుండా ఒక పెద్ద బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.

ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడం తన ప్రథమ కర్తవ్యమని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రశాంత ప్రాంతంగా పేరుగాంచిన మల్కాజిగిరి ప్రతిష్టను మరింత నిలబెట్టేందుకు కట్టుదిట్టమైన శాంతిభద్రతలు అమలు చేస్తామని, ఎక్కడా రాజీ పడబోమని ధీమా వ్యక్తం చేశారు.

నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తామని పేర్కొన్న సీపీ సుమతి, ముఖ్యంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. AI ఆధారిత “TG QUEST” వంటి టెక్నాలజీని వినియోగిస్తూ, ప్రాసెస్ ఓరియెంటెడ్ మరియు రిజల్ట్ ఓరియెంటెడ్ విధానాలతో బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని కూడా చెప్పారు.

సమాజానికి పెద్ద ముప్పుగా మారుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆమె, ప్రివెన్షన్ నుంచి ఇన్వెస్టిగేషన్ వరకు అన్ని దశల్లో సమగ్రంగా వ్యవహరిస్తామని తెలిపారు. యువత మత్తుకు బానిస కాకుండా ఉండేందుకు AI ఆధారిత నిఘా వ్యవస్థను అమలు చేస్తామని వెల్లడించారు.

అలాగే, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని వాహన రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ప్రజల ప్రయాణ భద్రతను మెరుగుపరచడం తమ ప్రాధాన్యతగా ఉంటుందని స్పష్టం చేశారు.

మహిళా పోలీస్ కమిషనర్‌గా అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, సహకరించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకతతో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని సీపీ సుమతి విశ్వాసం వ్యక్తం చేశారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Rangareddy
నల్ల పోచమ్మ అమ్మవారి సేవలో" బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్...
కుత్బుల్లాపూర్ డివిజన్ సంజీవయ్య నగర్ లోని శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగను...
By Ponnala Srinivasrao 2026-08-08 01:23:45 0 116
Andhra Pradesh
నూతన సంవత్సర శుభాకాంక్షలు
భారత్ ఆవాజ్  మీడియా మిత్రులకు, ప్రతినిధులకు  మరియు ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర...
By Karapati Gopi 2026-01-01 00:40:13 0 833
Andhra Pradesh
కాఫీ విత్ కబుర్లు కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
దేశాన్ని నడిపే సామర్థ్యం కలిగిన నాయకుడు సాధ్యంలో మనం పని చేస్తున్నాము పార్టీ కార్యకర్తలకు గౌరవమే...
By Benguluri Madhubabu 2026-03-25 13:43:04 0 253
Andhra Pradesh
రైతన్న సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే నరేంద్ర వర్మ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’ కార్యక్రమంలో...
By Vadlamudi NagaVenkat 2026-03-17 18:05:33 0 933
Andhra Pradesh
అంజుమన్‌ భూములను ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయం ఎదుట గుంటూరు వైఎస్సార సీపి నాయకులు «నిరసన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి చిన కాకానిలోని 71.5 ఎకరాల అంజుమన్‌ భూమిని ప్రైవేటీకరణను తక్షణమే...
By John Baji 2026-02-11 06:40:27 0 576
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com