ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి....

0
415

ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి

డీఆర్‌డీఓ నాగ పద్మజ...

లక్ష్మీపురంలో ఊర చెరువు పూడికతీత పనుల పరిశీలన...

కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల పంపిణీ...

భారత్ అవాజ్ న్యూస్ :దుగ్గొండి: ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలకు పని ప్రదేశాల్లో అన్ని రకాల వసతులు కల్పించాలని డీఆర్‌డీఓ నాగ పద్మజ అధికారులను ఆదేశించారు. మంగళవారం దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో చేపడుతున్న ఊర చెరువు పూడికతీత పనులను ఆమె క్షేత్రస్థాయిలో సందర్శించారు. పనుల తీరును పరిశీలించిన అనంతరం కూలీలతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశంలో తగినంత నీడ సౌకర్యం కల్పించాలని, కూలీలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కూలీలకు ఓఆర్‌ఎస్‌ (ORS) ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉపాధి పనుల్లో మరింత మంది పాల్గొనేలా ప్రోత్సహించాలని, ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను తప్పనిసరిగా నియమించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో లెక్కల అరుంధతి, సర్పంచ్ కన్నం అలిమా చిరంజీవి, ఏపీవో శ్రీనివాస్, ఈసీ రాజు, టీఏ మౌనిక, పంచాయతీ కార్యదర్శి కొండల్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ మరియు ఐకేపీ ప్రతినిధులు పాల్గొన్నారు. దుగ్గొండి రిపోర్టర్ జి రాము...

 

Search
Categories
Read More
Andhra Pradesh
కలెక్టరేట్లో నేడు కవయిత్రి ఆతుకూరి జయంతి
కవయిత్రి ఆతుకూరి మోల్లమాంబ (మొల్ల) జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయ...
By Boiena Rajesh 2026-03-13 04:50:53 0 275
Bharat Aawaz
Reporter or Sales Men ?
Sales, Promotions, Advertisements. Is this the Work of a Journalist? Is the Media For this to...
By JoinBMA 2025-07-10 10:13:36 0 3K
Andhra Pradesh
విజయవాడ పివిపి మాల్ రోడ్డు విస్తరణ మీ అభిప్రాయాలు తెలపండి
విజయవాడ నగరపాలక సంస్థ  24-01-2026        *పివిపి మాల్ రోడ్ విస్తరణ...
By Rajini Kumari 2026-01-25 11:15:19 0 249
Andhra Pradesh
ప్రతి రోజూ ఉచిత భోజనం
శ్రీసత్య సాయి సోషియల్ వెల్ఫేర్ ట్రస్ట్  వారు విశాఖ కేజీ హేచ్ ఆసుపత్రి ఎదుట ప్రతి రోజూ...
By Mobbu Venkatramana 2026-01-17 08:16:26 0 635
Telangana
బిజెపి ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,
క్యాతనపల్లి మున్సిపాలిటీ అమ్మ గార్డెన్ స్టేజి దగ్గర గద్దెరాగడిలో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు...
By Avunoori Mahesh 2026-04-18 07:51:07 0 311
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com