బిజెపి ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,

0
308

క్యాతనపల్లి మున్సిపాలిటీ అమ్మ గార్డెన్ స్టేజి దగ్గర గద్దెరాగడిలో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు ఆధ్వర్యంలో తేజస్వీ సూర్య దిష్టిబొమ్మని దగ్ధం చేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తెలియని బిజెపి ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో ఇండియా పాకిస్తాన్ విభజన లాగా జరిగిందని అవహేళనగా మాట్లాడడం, మైక్ ఇచ్చారుగా అని ఏది పడితే అది తెలంగాణ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని, నీలాంటి విలువలేని వాళ్లకు తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడం సరి కాదు,తెలంగాణ రాష్టమేమి ఒక్కరు సాధించిన త్యాగఫలం కాదు. కన్నడ రాష్ట్రo వాడికి తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుంది. నిజాం పాలకుల నుంచి హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటు, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను అన్ని వర్గాలలో అన్ని విభాగాలలో అభివృద్ధి చేయకపోవటంతో ఇక్కడి తెలంగాణ ప్రజలు సాహితీవేత్తలు, కళాకారులు,రాజకీయ నాయకులువిద్యార్థులు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి స్వరాష్ట్రం కోసం ఎంతోమంది ప్రాణ బలిదాలకు సిద్ధపడి తెలంగాణను తీసుకొచ్చుకుంటే కుర్రకూతల కూసే బిజెపి ఎంపీ తేజస్వీ సూర్య లాంటి బచ్చగాళ్ళకి తెలంగాణ రాష్ట్రం గురించి ఎలా తెలుస్తుంది. ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు తెలంగాణ గురించి మాట్లాడడం, తేజస్సు సూర్య నువ్వేమి తెలంగాణను ఉద్ధరించలేదు తెలంగాణకు సాయం చేయలేదు తెలంగాణ యొక్క బాగోగులను చూసుకోలేదు అలాంటి నువ్వు,నీకెక్కడిది మా తెలంగాణ గురించి మాట్లాడడానికి, అనవసరంగా కారు కూతలు కూసేవనుకో ఇకపై నువ్వు తెలంగాణ మాట ఎత్తితే ఢిల్లీలో కూడా నిన్ను అడ్డుకుంటాం, చిత్తశుద్ధి లేని తెలంగాణ బిజెపి ఎంపీలు తెలంగాణ గురించి ఇంత మాట్లాడుతున్న తేజస్వీ సూర్యను ఒక్కసారి కూడా నిలదీయకుండా వాడి వెనకనే వంతపడడం నిజంగా సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

 ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,మాజీ జిల్లా అధికార ప్రతినిది ఒడ్నాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య,మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జంగం కళ,జిల్లా కార్యదర్శి గోపతి బానేష్,కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాస్,భీమ మల్లేష్,కూతురు ప్రభాకర్,మెట్ట సుధాకర్, నక్క శ్రీనివాస్,పనస రాజయ్య,చంద్రగిరి ఎల్లయ్య,మేకల శ్రీను,సంఘ తిరుపతి,పందిరి లింగయ్య,ఉటూరి రాజానర్సు,నేరెళ్ల చంద్రయ్య,లక్ష్మా రెడ్డి,లచ్చులు, కనుక్కుట్ల కనకయ్య,సంజీవ రెడ్డి, వేణిగాళ్ల శ్రీనివాస రావు,నాగరాజు, ప్రేమ్ సాగర్, రామ్ సాయి, కుర్మ ప్రసాద్ మహిళ నాయకురాళ్లు పుష్ప, సృజన తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Rajasthan
Rajasthan Tragedy: Four Good Samaritans Killed While Assisting Accident Victims in Dungarpur
Jaipur/Dungarpur: In a heartbreaking turn of events, four people lost their lives and eight...
By BMA ADMIN 2025-05-20 06:54:11 0 3K
Bharat Aawaz
Why Bharat Aawaz Is Not Just a Media Channel, But a Mission!
🛕 From Reporting to Nation Building – Together, We Rise Bharat Aawaz is not just...
By BMA ADMIN 2025-06-28 09:14:03 0 3K
Andhra Pradesh
సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు.
X సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు 25-06-2026 Thu Andhra CI...
By Pagadala Venkateswar 2026-06-25 06:14:38 0 71
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:40:51 0 2K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో స్వచ్ఛ రథాలు ప్రారంభం
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో ఎంపీడీవో కార్యాలయాల వద్ద స్వచ్ఛ రథాలను నాయకులు, అధికారులు,...
By Kothuru Murali 2026-02-22 13:21:29 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com