బీఆర్ అంబేడ్కర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఘన నివాళులు.

0
192

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా బాబాసాహెబ్‌ను స్మరించుకున్నారు.

 

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి అర్పిస్తూ.. అంటరానితనాన్ని ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగిన అంబేడ్కర్ ఆదర్శప్రాయుడని కొనియాడారు. "ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలుస్తోందంటే దానికి కారణం ఆయన మనకిచ్చిన రాజ్యాంగమే. అంబేడ్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే ఘన నివాళి" అని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

మంత్రి నారా లోకేశ్ కూడా అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు. "పేద, బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది" అని అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Telangana
బీజేపీ నేతల అరెస్ట్‌పై దుమారం.|
● హైదరాబాద్‌లో శాంతియుత నిరసనకు బయలుదేరిన బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ●...
By Sidhu Maroju 2026-07-22 11:40:49 0 126
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ లో వరాలు ఉంటాయా?
కేంద్ర బడ్జెట్ 2026-27 లో ఏపీకి భారీ పెట్టుబడులు, నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం...
By Pagadala Venkateswar 2026-01-31 12:09:24 0 204
Andhra Pradesh
కిష్టవరం టోల్గేట్ వద్ద కిలోమీటర్ మేర భారీగా వాహనాలు , పట్టించుకోకుండా సర్వర్ ఇష్యూ అంటూ సిబ్బంది, ఎన్ని రోజులు ఈ అగపాట్లు అంటూ ప్రయాణికులు!
కిర్లంపూడి,కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేటు వద్ద గురువారం కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీ ఉండడం,...
By Nandika Jayababu 2026-04-30 18:49:59 0 572
Health & Fitness
మైలారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
శాయంపేట మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆరోగ్య సంరక్షణ ప్రతినిధి అరికిల్ల సుమన్(CRA)...
By Sriramula Anil 2026-07-10 08:40:30 0 291
Telangana
సికింద్రాబాద్ వైఎంసీఏలో ఆడిటోరియం, గెస్ట్ రూములను ప్రారంభించిన మంత్రులు అట్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వైఎంసిఏ లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, గెస్ట్ రూమ్ లను మంత్రులు...
By Sidhu Maroju 2025-09-12 10:30:35 0 338
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com