సింగరేణిలో అగ్గి పుట్టిస్తాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

0
222

సింగరేణిలో అగ్గి పుట్టిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, కార్మికులు కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించాలని, లేనిపక్షంలో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని, "బొగ్గు గనుల్లో అగ్గి మండిస్తాం” అని హెచ్చరించారు. సింగరేణిలో అంతా అవినీతిమయంగా మారిందన్నారు, ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి చెబితేనే అక్కడ పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై సిట్ (SIT) లేదా ఏసీబీ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సవాల్ విసిరారు. ఇచ్చిన ఉద్యోగాలపై ఏసీబీ విచారణ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబుతున్నారని ఇక్కడ విచారణ చేయాల్సింది సింగరేణి అవినీతి మీదన్నారు. ఏసీబీ విచారణకు భయపడేది లేదన్నారు. "గాడిదలకు గడ్డేసి.. ఆవుకు పాలు వస్తాయా సింగరేణి ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం తమ్ముళ్లు తమను అడుగుతున్నారని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం కోసం స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల గల్లా పట్టుకుని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పోరాటంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, రాష్ట్ర నాయకులు విజిత్ రావు, టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ చిలుముల రాకేష్, జాన్సన్ నాయక్, బోడ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
“నాయకుల చేతుల్లో ఎకరాలు పెరుగుతున్నాయి.. సామాన్యుడి చేతుల్లో మాత్రం EMIలు ఎందుకు పెరుగుతున్నాయి?” శ్రీను రావు పొన్నాల
తెలంగాణలో సామాన్యుడి బతుకు ఎప్పుడు మారుతుంది? ‎హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు...
By Ponnala Srinivasrao 2026-09-19 04:36:20 0 57
Bharat Aawaz
Kargil War Hero’s Family Harassed Over Citizenship Proof in Pune
In a deeply disturbing incident, the family of a decorated Kargil War veteran in Pune faced...
By Citizen Rights Council 2025-08-06 12:58:02 0 2K
Telangana
మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక గిరిజనుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలను ఏం చేశారు?
‎సింగర్ మంగ్లీ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం...
By Ponnala Srinivasrao 2026-05-01 02:46:02 0 175
Andhra Pradesh
నారా లోకేష్‌కి జన్మదిన శుభాకాంక్షలు: కట్టా దొరస్వామి.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు, శుక్రవారం నారా లోకేష్ 43వ...
By Pagadala Venkateswar 2026-01-23 10:59:38 0 224
Jharkhand
Jharkhand Rural Wage Hike: New Mission Benefits Workers
The Government of India has officially launched the Viksit Bharat – Guarantee for Rozgar...
By Lokeshwari Panthadi 2026-07-02 05:03:30 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com