సీఐటీయూ ఆధ్వర్యంలో సామజిక న్యాయ వారోత్సవాలు

0
206

మంచిర్యాల :  మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఐటీయు ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ - సవాళ్లు అనే అంశంపై ఈ రోజు సెమినార్ నిర్వహించడం జరిగింది.ముందుగా జ్యోతిరావు పూలె గారి 199వ జయంతి నిర్వహించుకోవడం జరిగింది.8 గంటల పని,కార్మిక చట్టాలు,సామాజిక భద్రత రాజ్యాంగం ఉద్యోగులకు, కార్మికులకిచ్చిన హాక్కులు.భారత రాజ్యాంగాన్ని కాపాడు కుంటేనే హాక్కులకు రక్షణ.సామాజిక ఉద్యోగ సంఘాల జిల్లా కన్వినర్ రంగు రాజేశం మాట్లాడుతూ.సీఐటీయు మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ వారోత్సవాల సందర్బంగా శనివారం రోజున పట్టణంలోని పూలె భవనంలో మహాత్మజ్యోతి రావు పూలే 199వ జయంతి ని ఘనంగా నిర్వహించడం జరిగింది.అనంతరం దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి అధ్యక్షతన రాజ్యాంగ పరిరక్షణ - సవాళ్లు అనే అంశం పై సెమినార్ నిర్వహించడం జరిగింది. వక్తలు సామజిక, ఉద్యోగ సంఘాల జిల్లా కన్వినర్ రంగు రాజేశం, డాక్టర్ చంద్రశేఖర్ గార్లు మాట్లాడుతూ. జ్యోతిరావు పూలె 1827, ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో గోవింద రావ్ పూలె,చిమ్నాబాయి దంపతుల ఇంట జన్మించాడు.ఓసారి స్నేహితుడి ఇంట పెళ్లికి వెళ్లినప్పుడు కులం పేరుతో జరిగిన అవమానం జ్యోతిరావ్ పూలే జీవితాన్ని మలుపు తిప్పింది. కులవివక్షకు వ్యతిరేకంగా, స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు.భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నేటి కేంద్రంలోని బీజేపీ పాలకులు అధికారం ఉన్న రాష్టాలల్లో మహిళలపై దాడులు అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.8 గంటల పని విధానం, కార్మిక చట్టాలను రద్దు చేయ్యడం.ప్రభుత్వ భూములను,ప్రకృతి సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడడం జరిగింది.అంతే కాకుండా భారత రాజ్యాంగాన్ని మర్చివేసి మణుధర్మంను అమలు చేయాలని కుట్ర చేస్తుంది. మరో వైపు అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులపై,సామాజిక సంఘాల పై దాడులకు పునుకుంటుంది. పెట్టుబడిరులకు అనుకాలంగా శ్రామికుల, కార్మికుల హక్కులపై తీవ్రమైన దాడులు చేస్తుంది.దేశంలోని పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చాడానికి కార్మికులను బానిసలుగా మారుస్తుంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా, కుల నిర్ములనకు వ్యతిరేకంగా పోరాటం, చేయడమే జ్యోతిరావు పూలే గారి ఆశయలను ముందుకు తీసుకెళ్లినవాళ్ళం అవుతాము.ఈ కార్యక్రమంలో సంకె రవి సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు,దూలం శ్రీనివాస్,సాంబారి వెంకటస్వామి జిల్లా సహాయ కార్యదర్శులు , జిల్లా కమిటీ సభ్యులు పద్మావతి, స్వాతి, రాణి, గోమాస ప్రకాష్ సీఐటీయు నాయకులు రాందాస్, సాగర్ రెడ్డి, వెంకటేష్, అంజి, ప్రవీణ, బ్రహ్మయ్య వ్యకస జిల్లా ఉపాధ్యక్షులు,కే.ప్రేమ్ కుమార్ డివైఎఫ్ఐ జిల్లాఉపాధ్యక్షులు, దుర్గం ప్రవీణ్ డివైఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో ఏసీబీ దాడులు – రికార్డుల పరిశీలన.
మదనపల్లెలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కడప...
By Pagadala Venkateswar 2026-02-06 04:18:36 0 315
Andhra Pradesh
ఆ తగ్గింపు కంపెనీలకి వినియోగదారులకు కాదు చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం  ...
By Rajini Kumari 2026-03-30 04:59:14 0 209
Andhra Pradesh
చిత్తూరు జిల్లా వీకోట : దారుణం: ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య
ఉదయం మార్నింగ్ వాక్‌లో ఉండగా కత్తులతో దాడి హత్య కేసులో రౌడీ షీటర్ తమీమ్‌ను...
By Pagadala Venkateswar 2026-04-28 05:02:18 0 126
Andhra Pradesh
బెస్తపల్లి వద్ద 50 ఎకరాల్లో నూతన టమాటా మార్కెట్ యార్డ్.
మదనపల్లె మండలం కొండామరిపల్లి గ్రామ పరిధిలోని బెస్తపల్లి వద్ద 50 ఎకరాల్లో నూతన టమాటా మార్కెట్...
By Pagadala Venkateswar 2026-05-02 02:40:15 0 121
Andhra Pradesh
ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతున్న ఆంధ్ర శబరిమలై..
  ఆధ్యాత్మిక క్షేత్రంగా విరజిల్లుతున్న ఆంధ్రా శబరిమలై పర్వతంపై ప్రత్యేక ఆకర్షణగా...
By BABJI DADALA 2026-02-21 12:56:11 0 548
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com