రాజకీయాల్లో జగన్ ఓ జోకర్ టిడిపి రాష్ట్ర నాయకులుమాదగాని గురునాథం

0
160

ప్రచురుణార్థం (10.04.26) 

 

 

                                        *రాష్ట్ర రాజకీయాల్లో జగన్ ఓ జోకర్*

                                  ` *-------టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం*

 

 *విజయవాడ* : రాష్ట్ర రాజకీయాలలో వైసిపి అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి ఓ జోకర్ అయ్యాడని టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం ఎద్దేవా చేశారు. తెలుగువాడై ఉండి రాష్ట్ర రాజధాని పేరు మావిగాన్ అంటూ మాట్లాడి వైసిపి శ్రేణులతో కూడా జగన్ ఛీ అని పించుకుంటున్నాడని అన్నారు.

 

గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాదిగాని గురునాథం మాట్లాడుతూ..... జగన్ నోటి వెంట వచ్చిన మావిగాన్ ఒక ‘మాయాగన్’ అని అన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ జగన్ చేసిన చట్టం హైకోర్టులో వీగిపోయిందని, పార్లమెంట్‌లో కూడా ఆయనకు గతంలో మొట్టికాయలు పడ్డాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 151 సీట్లు ప్రజలు ఇచ్చినా వైసిపి ప్రభుత్వ పాలనలో ఒక సరైన బిల్లు కూడా పెట్టలేని అసమర్థుడు జగన్ అని విమర్శించారు .

 

 అమరావతి రాజధానిగా ఉండటాన్ని రామోజీరావు గారు నామకరణం చేశారని, అది ప్రస్తుతం చట్టబద్దతతో గెజెట్‌లో కూడా నమోదైందని, దాన్ని మార్చడం జగన్ వల్ల కాదని స్పష్టం చేశారు . చంద్రబాబుపై అసూయతో రాజధానిని అతాకతలం చేసేందుకు జగన్ తన ‘సైతాను సైన్యాన్ని’ వాడుకుంటున్నారన్నారు. ప్రజల చేత నియంత అని పించుకుంటున్నారన్నారు. 

 

ఉత్తర కొరియా నియంత కిమ్ తరహాలో జగన్ వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఆయనకు ఇక స్థానం లేదని గురునాథం పేర్కొన్నారు . అమరావతి రాజధాని మహిళలపై వైసిపి ప్రభుత్వ పాలనలో 2000 కేసులు బనాయించి, వారి ఇళ్లపై డ్రోన్లు పంపించి వేధించిన దుర్మార్గుడు జగన్ అని, ఇప్పుడు మహిళల సంక్షేమం, గౌరవం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. రాజకీయంగా జగన్ పతనం మొదలైందని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోకపోతే జనం తరిమి తరిమి కొట్టడం ఖాయమని హెచ్చరించారు .రాబోయే రోజుల్లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చేసిన తప్పులకు జగన్ మోహన్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. 

 

గత ఐదేళ్ల పాలనలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా గొంతు నొక్కేందుకు జగన్ తీవ్ర ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు . ఏబిఎన్ వంటి దమ్మున్న ఛానళ్లను టార్గెట్ చేస్తూ, కులాలను ఆపాదించి వేధించారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఏబీఎన్ ` ఆంధ్ర జ్యోతి పై అక్కసుతో దాడులకు పాల్పడుతున్నారన్నారు. మీడియాపైన, ప్రజలపై గతంలో చేసిన దాడుల వల్లే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారని, ఇకముందు కూడా ఇదే ధోరణి కొనసాగిస్తే 2029 నాటికి జగన్ రెడ్డి ‘జీరో రెడ్డి’ కావడం ఖాయం” అని హెచ్చరించారు .

 

టిడిపి సీనియర్ నాయకులు నరసింహ చౌదరి మాట్లాడుతూ....వైసిపి పార్టీ రాష్ట్రానికి పట్టిన ఛీడగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం పాటుపడుతుంటే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా జగన్‌మోహన్‌రెడ్డి, వైసిపి పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. ఇదే పరిస్థితి వైసిపి కొనసాగిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగు కావడం తధ్యం అన్నారు. 

 

టిడిపి జిల్లా నాయకులు డాక్టర్ విశ్వనాధం మాట్లాడుతూ..... ఏబీఎన్ వంటి మీడియా సంస్థల జోలికి వచ్చి జగన్ తన ఉనికిని కోల్పోయే పరిస్థితులను తెచ్చుకున్నాడని అన్నారు. ఎంతో నిబద్ధత గల జర్నలిస్టు ఏబీఎన్ రాధాకృష్ణ అని, ఆయనను జగన్ ఇబ్బంది పెట్టాలనుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. 

 

టిడిపి నాయకులు కె. జీవన్ మాట్లాడుతూ....రాజధాని అమరావతి విషయంలో వైసిపి చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజా రాజధాని అమరావతి విషయంలో ఇప్పటికైనా వైసిపి నాయకులు తమ వైఖరి మార్చుకుని అమరావతికి జై కొడితే ప్రజలు హర్షిస్తారని, లేకుంటే రాష్ట్రం నుంచి తరిమి కొడతారన్నారు.

Search
Categories
Read More
Telangana
నారాయణపేట జిల్లాలో దారుణ 
భరత్ అవాజ్  సూర్యమోహన్        నారాయణపేట జిల్లాలో దారుణ ...
By Vanmoj Suryamohan 2026-07-24 02:37:00 0 187
SURAKSHA
Sagar Singh Kalsi IPS: Leading with Vision and Integrity
The Journey Begins "The badge is not just a symbol of authority—it is a...
By Fathima Safa 2026-07-23 10:14:01 0 143
BMA
Journalism Saves Lives During Times of Crisis
During natural disasters, health emergencies, and other crises, journalism becomes a vital public...
By JoinBMA 2026-08-20 09:16:13 0 61
Telangana
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం..
PM Narender modi .... March 27 Today 6:30 pm 
By Sunka Santhosh 2026-03-27 12:07:27 0 314
Andhra Pradesh
ఆధ్యాత్మిక జెన్Z వాగ్లర్ స్వాతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు
దేశవ్యాప్తంగా బైక్ పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న జెన్ Z వాగ్లర్...
By Rajini Kumari 2025-12-23 07:36:40 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com