తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

0
231

మరిపెడ, ఏప్రిల్ 10:తెలంగాణ మోడల్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను ఈ నెల 19న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ అఖ్తరుజ్జమాన్ తెలిపారు.6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతుందని, 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు పరీక్షలు మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు నిర్వహించబడతాయని వెల్లడించారు.పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఈ నెల 10వ తేదీ నుండి అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.ఆన్లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులందరూ మరిపెడలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో హాల్ టికెట్‌తో పరీక్షకు హాజరుకావాలని సూచించారు.పరీక్షలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయని, సమాధానాలను OMR షీట్‌పై గుర్తించాల్సి ఉంటుందని తెలిపారు. పరీక్షా హాలులోకి ఎగ్జామ్ ప్యాడ్, హాల్ టికెట్, బాల్ పెన్నులు, నీటి సీసా మినహా ఇతర వస్తువులు అనుమతించబడవని స్పష్టం చేశారు.విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకుని నియమాలను పాటించాలని ప్రిన్సిపాల్ సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Krishna Mohan Reddy: ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీం కోర్టులో నిరాశ.
రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ...
By Pagadala Venkateswar 2026-01-21 14:49:44 0 209
Telangana
యాదేచ్చగా చెరువు కబ్జా..
కులస్పూర్ గ్రామ చెరువుని యాదేచ్చగా కబ్జా చేసిన వైనం. గ్రామ చెరువుకి సంబంధించిన భూమిని సుమారు మూడు...
By Chakrala Sadhanand 2026-06-25 07:33:22 0 762
Telangana
'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్' లో జరిగిన స్నేహితుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నాయకులు
సికింద్రాబాద్/ బేగంపేట్. బేగంపేట్ లోని 'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్ హైదరాబాద్' లో స్నేహితుల...
By Sidhu Maroju 2025-08-03 16:51:21 0 858
Andhra Pradesh
మినీ గోకులం (పశువుల షెడ్డు) శాంక్షన్ ఆర్డర్ కాపీలను లబ్దిదారులకు అందచేసిన పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్.
పొన్నూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ (MPDO) కార్యాలయం నందు పొన్నూరు మండలంలోని వివిధ గ్రామాలకు...
By John Baji 2026-02-03 07:27:51 0 381
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు తాటిమకుల పాలెం అటవీ క్షేత్రాది కార్యాలయం వద్ద ఉద్రిక్తత.
పుంగనూరు అటవీ క్షేత్ర కార్యాలయం వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. పాలెంపల్లి గ్రామ సమీపంలో...
By Kothuru Murali 2026-01-26 07:11:18 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com