Krishna Mohan Reddy: ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీం కోర్టులో నిరాశ.

0
208

రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప 

రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు

ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచన

ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తమ డిఫాల్ట్ బెయిల్ ను రెగ్యులర్ బెయిల్ గా మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

 

 

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు, నిందితులకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ట్రయల్ కోర్టేనని స్పష్టం చేసిన ధర్మాసనం, నాలుగు వారాల గడువు ఇస్తూ ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిన సందర్భంగా విధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

 

 

మద్యం కేసు నేపథ్యం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరిగాయని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ‘జే బ్రాండ్’ పేరుతో ప్రజలను నిలువుదోపిడి చేశారని తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై లోతైన విచారణకు ఆదేశించింది.

 

 

దీంతో అప్పటి మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు కాగా, పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇప్పటికే కొందరు నిందితులకు బెయిల్ లభించగా, మరికొందరు ఇంకా జైలులోనే ఉన్నారు. ఇంకొందరు నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
జులై 29న గురు పౌర్ణమి వేడుకలు.. ముమ్మరంగా ఏర్పాట్లు!
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం గుడిశవారిపల్లి సాయిబాబా ఆలయంలో జులై 29న గురు పౌర్ణమి వేడుకలను...
By Pagadala Venkateswar 2026-07-24 05:14:24 0 111
Delhi - NCR
Heavy rains bring major tragedy in Delhi
DELHI - Heavy rains triggered a tragic incident in Delhi’s Jaitpur area, where a wall...
By Bharat Aawaz 2025-08-12 11:25:57 0 1K
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా యువతకు సువర్ణావకాశం ఉచిత పోలీస్ కోచింగ్ ప్రారంభం, జిల్లా ఎస్పీ నితికా పంత్ వెల్లడి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ...
By Chunarkar Jagadeesh 2026-08-12 10:35:05 0 186
Andhra Pradesh
ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం
ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది వివరాలకు వెళితే విశాఖ బీచ్ రోడ్ కామత్ బోజన...
By Mobbu Venkatramana 2026-03-12 14:15:43 0 671
Telangana
పిన్నారం గ్రామంలో నీటి ఎద్దడికి చెక్... బోర్వెల్ ప్రారంభించిన మంత్రి, ఎంపీ
కోటపల్లి, జూన్ 1: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పిన్నారం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను...
By Avunoori Mahesh 2026-06-01 11:18:29 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com