ఎన్టీఆర్ జిల్లా నీటి నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు

0
203

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*ఎన్‌టీఆర్ జిల్లా, ఏప్రిల్ 08, 2026*

 

*నీటి నాణ్య‌త విష‌యంలో రాజీప‌డేది లేదు..*

- *వేసవి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి*

- *ఆర్‌వో ప్లాంట్లు, తాగునీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి*

- *నిబంధనలు పాటించని ప్లాంట్లపై కఠిన చర్యలు త‌ప్ప‌వు*

- *జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

 

వేసవి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఆర్‌వో నీటి శుద్ధి ప్లాంట్లు, తాగునీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ల్లో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని, నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్, వీఎంసీ ప్ర‌త్యేక అధికారి డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు.

క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ బుధ‌వారం ముత్యాలంపాడు, సత్యనారాయణపురం ఆర్‌వో ప్లాంటును ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ ప్లాంటుకు నీరు ఎక్క‌డి నుంచి వ‌స్తుంది? అనుమ‌తుల వివ‌రాలు, ఉప‌యోగిస్తున్న సాంకేతిక ప‌రిక‌రాలు, ప‌రిశుభ్ర‌త ప్ర‌మాణాలు, నాణ్య‌త ప‌రీక్ష‌ల వ్య‌వ‌స్థ త‌దిత‌రాల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ప్ర‌తి తాగునీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ నిర్దేశ ప్ర‌మాణాలు పాటించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌కు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందించడం అత్యంత ప్రాధాన్య‌మ‌ని.. అన్ని ఆర్‌వో ప్లాంట్లను క్రమం తప్పకుండా త‌నిఖీ చేయాల‌ని, షెడ్యూల్ వివ‌రాల‌ను ప్లాంట్ల వ‌ద్ద ప్ర‌ద‌ర్శించాల‌ని ఆదేశించారు. తనిఖీల సంద‌ర్భంగా నీటి నాణ్యత ప్రమాణాలు, ఫిల్టరేషన్ విధానం, యంత్రాల పనితీరు, శుభ్రత పరిస్థితులు, నిర్వహణ విధానం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా నడుస్తున్న లేదా నిబంధనలు పాటించని, ప్రమాణాలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఆర్‌వో ప్లాంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేసవిలో తాగునీటి వినియోగం గణనీయంగా పెరుగుతున్నందున, ప్రజలు ఉపయోగించే నీటి నాణ్యతపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ప్ర‌జ‌లు కూడా ఏవైనా స‌మస్య‌లు ఉంటే స్థానిక అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకురావాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.

క‌లెక్ట‌ర్ వెంట న‌గ‌ర‌పాల‌క సంస్థ ఇన్‌ఛార్జ్ సీఈ పి.స‌త్య‌కుమారి, సీఎంహెచ్‌వో కె.అర్జున‌రావు తదిత‌రులు ఉన్నారు.

(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

Search
Categories
Read More
Rajasthan
Rajasthan Boosts Mining and Mineral Development Growth
Rajasthan continues to reinforce its position as India's leading mineral-producing state through...
By Fathima Safa 2026-07-03 04:27:14 0 87
Bharat Aawaz
ANTI DRUG AWARENESS PRORAME
Student Awareness Program Held at HMT Nagar Lake Park Nacharam Police Conduct Anti-Drug, Traffic...
By Shaik Baba 2026-09-16 13:53:37 0 101
Andhra Pradesh
అంబటి రాంబాబు ధర్మ పోరాటానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు మద్దతు
అంబటి రాంబాబు ధర్మపోరాటానికి వెలంపల్లి శ్రీనివాసరావు మద్దతు: కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో...
By Rajini Kumari 2026-04-18 17:30:47 0 163
Andhra Pradesh
బాల్య వివాహాలు - చట్ట విరుద్ధం :విశాఖ అధికారులు వెల్లడి
బాల్య వివాహాలు అంటే 18 లేదా 21సంవత్స రములు రాక మునుపు చేస్తే వివాహాలను బాల్య వివాహాలు అంటారు. ఐతే...
By Mobbu Venkatramana 2026-02-25 14:08:18 0 293
Andhra Pradesh
ఏపీలో మళ్లీ కరోనా కలకలం... నలుగురి మృతి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా...
By Pagadala Venkateswar 2026-07-17 05:41:40 0 87
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com