చేనేతల ద్రోహి మాజీ ఎంపీ బుట్టా రేణుక

0
225

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేత సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని కుట్ర రాజకీయాలు చేసేందుకు మాజీ ఎంపీ బుట్టారేణుక డ్రామాలు చేస్తున్నారని నందవరం మండల కన్వీనర్ కాసీంవలి అన్నారు. గురువారం నందవరం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… ఎమ్మిగనూరు చేనేతల కో ఆపరేటీవ్ సొసైటీ ( ywcs)ని ఆప్కోలో వీలీనం చేస్తున్నారనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. మార్కెటింగ్ మర్జర్ చేయడాన్ని వైసీపీ తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. ఎమ్మిగనూరు చేనేత సొసైటీలో వేల మంది సభ్యులు ఉన్న స్థితి నుండి 200 మందికి తగ్గినప్పుడు ఇదే బుట్టారేణుక ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. చేనేత సొసైటీ బాగుకోసం మా నాయకుడు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారు క్రుషి చేస్తున్నారని అన్నారు. కేవలం 200 మంది కోసం కాకుండా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్న 40 వేల మంది చేనేతల భవిష్యత్తును గురించి ఎమ్మెల్యే బివి గారు ఆలోచిస్తున్నారన్నారు. స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారి హయాం నుండి ఇప్పుడు ఆయన వారసుడు బివి జయనాగేశ్వర రెడ్డి గారి వరకు ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ గా చేనేతలకు అవకాశం ఇచ్చారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ సంప్రదాయాన్ని ప్రారంభించిందే బివి కుటుంబం అన్నారు. చేనేతలను మోసం చేసిన చరిత్ర వైసీపీదేనని ఎద్దేవా చేశారు. కుర్ణి కులస్తులు ఉన్న నాగలదిన్నె గ్రామాన్ని దత్తత తీసుకుని కనీసం పిడికెడు మన్ను కూడా వేయకుండా దత్తత నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని పారిపోయిన చరిత్ర మీది. కూటమి ప్రభుత్వం సంప్రదాయ మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 92,724 మంది నేతన్నలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్ మొత్తం పెంచారని తెలిపారు. చేనేతలకు త్రిఫ్ట్ కింద ప్రభుత్వ వాటాను 8 నుంచి 16 శాతానికి పెంచారని చెప్పారు. ఈ పథకం కింద ప్రతి బడ్జెట్ లోనూ రూ. 5 కోట్ల చొప్పున కేటాయిస్తూ వస్తున్నారని తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా చేనేతల పట్ల బివి కుటుంబానికి ఉన్న అపారమైన అనుబంధాన్ని విడదీయలేరని అన్నారు. తప్పుడు ఆరోపణలతో చేనేతల ద్రోహిగా బుట్టారేణుక చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకుని బుట్టా రేణుక ఎమ్మిగనూరు నియోజకవర్గ చేనేతలకు, ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు..!

Search
Categories
Read More
Uncategorized
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament Parliamentary Affairs...
By Bharat Aawaz 2025-07-17 08:20:04 0 2K
Mizoram
PM SHRI Scheme: Revamping 35 Mizoram Government Schools
The Mizoram education sector is set for a transformative upgrade as 35 government schools have...
By Lokeshwari Panthadi 2026-07-02 06:55:18 0 145
Andhra Pradesh
రాయచోటి పట్టణంలో నూతన పార్కు పనులను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలో మున్సిపల్ నిధులతో సుమారు 47 లక్షలతో జరుగుతున్న నూతన పార్కు పనులను...
By Benguluri Madhubabu 2026-04-16 11:28:07 0 258
Andhra Pradesh
బాపట్ల జిల్లా బృందం గోవా పర్యటన - కోస్తా టూరిజం అభివృద్ధిపై అధ్యయనం
బాపట్ల: బాపట్ల తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా, గోవాలోని పర్యాటక...
By Gadiyapudi Narendra 2026-02-18 16:20:31 0 248
Andhra Pradesh
త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో అన్నదాత సుఖీభవ - PM కిసాన్ (రైతన్న మీకోసం) 2026-27 సంవత్సర మొదటి విడత పంపిణి కార్యక్రమం
త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో అన్నదాత సుఖీభవ - PM కిసాన్ (రైతన్న మీకోసం) 2026-27 సంవత్సర...
By Chennaiah Kati 2026-06-21 00:09:39 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com