జాతీయస్థాయిలో వేములవాడ ఉపాధ్యాయురాలు ప్రతిభ

0
384

భారతి ఎయిర్‌టెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉపాధ్యాయుల టీఎల్‌ఎం (బోధన అభ్యసన సామాగ్రి) పోటీల్లో వేములవాడ పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు కోడం రాధిక సత్తా చాటారు. పరమాణువు నిర్మాణం (Atomic Structure) అంశంపై ఆమె రూపొందించిన నమూనాకు జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది.

​ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో రాధికను ప్రధానోపాధ్యాయులు బి. బన్నాజి నేతృత్వంలో తోటి ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈ విజయంతో పాఠశాల కీర్తి జాతీయ స్థాయికి చేరిందని, విద్యార్థులు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని విజ్ఞాన శాస్త్రంపై మక్కువ పెంచుకోవాలని ప్రధానోపాధ్యాయులు ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి. కృష్ణ, వి. బాలరాజు, పి. సత్యనారాయణ, ఏ. సరళ, టి. సరిత, టి. బాబు రాజు, జె. రవీందర్ రావు, ఎన్. స్వాతి, సి.హెచ్. అరుంధతి తదితరులు పాల్గొని రాధికకు అభినందనలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రైతులకు ‘అన్నదాత సుఖీభవ’, పీఎం కిసాన్ నిధుల విడుదల.
అన్నమయ్య జిల్లాలో 1,88,408 మంది రైతులకు మూడో విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రూ. 108.37...
By Pagadala Venkateswar 2026-03-13 07:12:58 0 210
Bihar
Bihar Teacher Transfer Rules 2026: A Reformist Approach
The Bihar government has approved the landmark Bihar State Teacher Transfer Rules 2026, marking a...
By Lokeshwari Panthadi 2026-06-26 12:53:29 0 160
Dadra &Nager Haveli, Daman &Diu
TRL Compass: A New Era for Government Project Evaluation
The government has officially launched the 'TRL Compass' platform, a cutting-edge tool designed...
By Lokeshwari Panthadi 2026-07-01 05:15:45 0 90
Andhra Pradesh
AP Land Prices: ఏపీలో ఆ భూములకు మార్కెట్ ధరలు పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు.
AP Land Prices Andhra Pradesh Hikes Land Values in Urban Areas ఏపీలో పట్టణ ప్రాంత భూముల విలువలు...
By Pagadala Venkateswar 2026-01-25 06:22:43 0 215
Andhra Pradesh
Nara Lokesh: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కాలేజీలు.. ఖాళీల భర్తీపై మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామన్న మంత్రి ప్రైవేటుకు దీటుగా...
By Pagadala Venkateswar 2026-02-24 08:15:39 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com