ఎమ్మిగనూరు తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేసిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రాజ్ దేశాయ్

0
240

 

శ్రీ గురురాజ్ దేశాయ్  మరియు బిజెపి నాయకులు ప్రముఖ న్యాయవాది శ్రీ ఉరుకుందు గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో బాగంగా బిజెపి రాష్ట్ర అద్యక్షులు శ్రీ మాధవ్ గారి అదేశాలమేరకు మరియు ఓబిసి మూర్ఛా రాష్ట్ర అద్యక్షులు శ్రీ గొపి శ్రీనివాస్ గారి సూచనలమేరకు రాష్ట్రం లో దాదపుగా నాలుగు లక్షలా యాబైవేల ఎకరాల దేవాదాయ భూములు ఉన్నాయి కానీ గత వైఎస్సార్ ప్రభుత్వం చేసిన తప్పిదాలవలన అందులొ లక్ష యాబై వేల ఎకరాల దేవాదాయ భూములు అన్యక్రాంతం అయినట్లు సమాచారం ఉంది. ఈ అన్యాక్రాంతమైన దేవదాయ భూముల మీద సమగ్ర విచారణ జరిపి బాద్యులైన వారిమీద కఠిన చర్యలు తీసుకొవాలని కోరారు. అలాగే ఏవైతే దేవదాయభూములు దీర్ఘకాలికంగా ఒకరికే లీజుకు ఇచ్చారో అలాంటివాటిని రద్దుపరచి స్వల్పకాలిక లీజులను ఇవ్వవలసిందిగా కొరారు. ఈ దేవదాయభూముల వలన వచ్చే రాబడిని సంబందిత దేవాదాయాలకే చెందేవిధంగా అలాగే ఆ దేవాలయాల నిర్వహణ కర్చులకు నిత్యపూజలకు ఉపయోగించే విదంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న పురాతన కోతులబావి శ్రీ భక్తంజినేయ స్వామి దేవాలయం స్థలము విషయంలొ కమిషనర్ గారు దుర్మార్గంగా విగ్రహాలను పడగొట్టి కంచెను ద్వoసం చేసి దేవాలయానికి అడ్డంగా బండలు పాతించి హిందువుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ప్రవర్తించటం చాలా బాధాకరం కాబట్టి తక్షణమే దేవాలయానికి అడ్డంగా పాతిన బండలు తీసేవిధంగా తక్షణమే అదేశాలు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్ల ఉపాధ్యక్షులు బి యల్ నారాయణ గారు, ఎమ్మిగనూరు రురల్ మండలాద్యక్షులు కురువ బడేసాబ్ , ఎమ్మిగనూరు టౌన్ బిజెపి SC మోర్చ అద్యక్షులు బాలాజీ, నందవరం మండల మాజి SC మోర్చా అద్యక్షులు కె శివ, మిట్టసోమపురం సినియర్ నాయకులు రామలింగప్ప, తిమ్మాపురం పెద్దయ్య, బనవాసి కర్ణ, గని, మినల్గా మరియు సోషియల్ మీడియా కన్వినర్ దండు వీరేశ్ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
చెరువుమాదారం లో ఎల్లయ్య గెలుపు...
మండలంలోని చెర్వుమధరం గ్రామంలో BRS బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధి ఎల్లయ్య 150 ఓట్ల తేడాతో తన ప్రత్యర్ధి...
By Krishna Balina 2025-12-14 23:33:52 0 329
Telangana
నిజామాబాద్: ఏప్రిల్ 2వతారికు వైన్సులు బ్యాండ్
జిల్లాలో 2వతరికున వైంసులు బంద్కనునాయి. హముమాన్‌జయంతి నేపత్యం లో శాంతిభద్రతాల దృష్టియా జిల్లా...
By Sadaq Sadaq 2026-03-31 17:28:11 0 200
Telangana
*మహిళా సంఘాల ఆధ్వర్యంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు మన్నెంపల్లి సర్పంచ్ పొన్నం సునీత అనీల్ గౌడ్ గారికీ ఘనంగా సన్మానం*
ఈరోజు తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలోని మహిళా సంఘం ల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన *సర్పంచ్...
By Bouth Arun 2025-12-30 02:51:18 0 660
Telangana
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్.
బోరాణి కమ్యూనిటీ లో మొహర్రం యొక్క ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, సబిత అనిల్...
By Sidhu Maroju 2025-07-02 13:43:06 0 1K
Andhra Pradesh
జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో మరోసారి సత్తా చాటిన బాపట్ల జిల్లా పోలీస్ కానిస్టేబుల్ కానిస్టేబుల్‌ను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో మరోసారి సత్తా చాటిన బాపట్ల జిల్లా పోలీస్ కానిస్టేబుల్...
By Gadiyapudi Narendra 2026-01-08 12:26:41 0 262
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com