Nara Lokesh: తెదేపా కార్యకర్తల కోసం లోకేశ్ ప్రత్యేక చొరవ.. రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ క్యాంప్.

0
218

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి నారా లోకేశ్‌ ఆదేశాలతో ఆదివారం మంగళగిరిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఈద్గా మైదానంలో ఆస్టర్‌ రమేష్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

 

ఈ శిబిరానికి తెదేపా కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 530 మందికి ప్రత్యేక వైద్య బృందం వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేసింది. పార్టీ కార్యకర్తల ఆరోగ్యంపై మంత్రి లోకేశ్‌ ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని డాక్టర్ కార్తిక్‌ చౌదరి అన్నారు. కార్యకర్తల ఆరోగ్య సమాచారాన్ని వారి పార్టీ గుర్తింపు కార్డుతో అనుసంధానించడం ఒక కీలకమైన ముందడుగు అని తెలిపారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో వారికి ఎలాంటి వైద్యం అందించాలనే దానిపై స్పష్టత వస్తుందని వివరించారు.

 

ఇలాంటి వైద్య శిబిరాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని వైద్య బృందం వెల్లడించింది. ఈ శిబిరంలో గుండె వైద్య నిపుణులు పెద్ది నవీన్‌ కృష్ణ, న్యూరాలజిస్ట్‌ మీనా, ఆర్థోపెడిక్‌ వైద్యులు భరత్‌ చంద్ర, చైతన్య, వసంతి, రావెల నీరెన్‌ తదితరులు వైద్య సేవలు అందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ బాంబే కాలనీలో ఎంపీ లార్డ్స్ నిధులు 75 లక్షలతో కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన
*ప్రచురణార్థం* ది:19-04-2026   *వాంబే కాలనీలో ఎంపీ లాడ్స్ నిధులు రూ. 75 లక్షలతో కమ్యూనిటీ...
By Rajini Kumari 2026-04-19 12:29:33 0 159
Andhra Pradesh
స్కూల్ విద్యార్థులకు శక్తి బృందం అవగాహన కార్యక్రమం
చీరాల: బాపట్ల జిల్లా ఎస్పీ, బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో ఇంకొల్లు...
By Gadiyapudi Narendra 2026-02-02 13:11:15 0 255
Andhra Pradesh
మూత్రశాల కంటే దారుణంగా వెలిగండ్ల సచివాలయం... అధికారులకు కనపడటం లేదా?
కొండాపురం (నెల్లూరు జిల్లా): మండల పరిధిలోని వెలిగండ్ల గ్రామ సచివాలయం నిర్వహణ కరువై తీవ్ర...
By VALLERU SIMHADRI 2026-09-15 16:58:01 0 142
Telangana
తెలంగాణ : 1.28 లక్షల పెన్షన్లు రద్దు...!
తెలంగాణ రాష్ట్రంలో  1.28 లక్షల పెన్షన్లు రద్దయ్యాయి. ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టి...
By Sunka Santhosh 2026-06-18 19:08:56 0 172
Andhra Pradesh
అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టా? వాస్తవాలు - అపోహలు....
సమాజంలో జరిగే విషయాలను సేకరించి, విశ్లేషించి ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రతి వ్యక్తీ జర్నలిస్టే....
By Gadiyapudi Narendra 2026-03-03 05:44:11 0 296
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com