విజయవాడ బాంబే కాలనీలో ఎంపీ లార్డ్స్ నిధులు 75 లక్షలతో కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన

0
156

*ప్రచురణార్థం*

ది:19-04-2026

 

*వాంబే కాలనీలో ఎంపీ లాడ్స్ నిధులు రూ. 75 లక్షలతో కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని చిన్ని మరియు ఎమ్మెల్యే బోండా ఉమ*

 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ వాంబే కాలనీలో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 

 

నిరుపేద వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు తన ఎంపీ లాడ్స్ (MPLADS) నిధుల నుండి కేటాయించిన రూ. 75 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారితో కలిసి ఈరోజు ఘనంగా శంకుస్థాపన చేశారు. 

 

ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

 

పేద క్రైస్తవ సోదరులు మరియు బడుగు బలహీన వర్గాల సామాజిక అవసరాలను గుర్తించి, పోస్టర్స్ అసోసియేషన్ విన్నపం మేరకు ఎంపీ కేశినేని చిన్ని గారు తక్షణమే స్పందించి తన ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా ఈ భారీ మొత్తాన్ని కేటాయించారు. ఈ నిధులతో నిర్మించబోయే క్రిస్టైన్ కన్వెన్షన్ సెంటర్ అందుబాటులోకి రావడం వల్ల స్థానిక నిరుపేదలు తమ శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు మరియు ప్రార్థనలను అతి తక్కువ ఖర్చుతో గౌరవప్రదంగా నిర్వహించుకోవడానికి వీలవుతుందని ఎంపీ గారు తెలిపారు.

 

విజయవాడ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ సమన్వయంతో ముందుకు సాగుతున్నారని, కూటమి ప్రభుత్వ హయాంలో నిధుల కొరత లేకుండా ప్రతి గడపకూ అభివృద్ధి ఫలాలు అందజేస్తామని నేతలు స్పష్టం చేశారు. 

 

ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో పనిచేస్తుందని వారు పునరుద్ఘాటించారు.

 

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు కంచి దుర్గ, టీడీపీ సీనియర్ నాయకులు నవనీతం సాంబశివరావు, క్లస్టర్ ఇంచార్జి కంచి ధనశేఖర్,డివిజన్ ప్రెసిడెంట్ బెవర సూరి, నాగరాజు కూటమి పార్టీల నాయకులు, పోస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గాబేరియాల్,రత్నబాబు ,ఆదిబాబు,వాసు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సాలూరు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు
సాలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ప్రమాద ఘటనపై మంత్రి సంధ్యారాణి తీవ్ర...
By Boiena Rajesh 2026-08-17 16:16:29 0 128
Andhra Pradesh
విద్యాసంస్థలు జీరో వేస్ట్ కేంద్రాలుగా మారాలి: కలెక్టర్.
మదనపల్లె జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు వ్యర్థ రహిత కేంద్రాలుగా మారాలని జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-03-28 14:40:27 0 214
Telangana
Inspector Prashanth Receives District Commendation.|
● Recognition presented on the occasion of Independence Day ● Commended for effective policing...
By Sidhu Maroju 2026-08-15 17:23:17 0 202
Nagaland
Dimapur Smart City Project Picks Up Pace with Green Initiatives
Under the Smart Cities Mission, Dimapur is witnessing a wave of transformation. The...
By Bharat Aawaz 2025-07-17 11:08:28 0 1K
Andhra Pradesh
డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ కి మంచి సువర్ణావకాశం
డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఉచిత సీఆర్‌టీ శిక్షణ:    అప్‌టెక్ సొల్యూషన్స్...
By Rajini Kumari 2026-08-29 15:38:29 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com