స్కూల్ విద్యార్థులకు శక్తి బృందం అవగాహన కార్యక్రమం

0
252
చీరాల: బాపట్ల జిల్లా ఎస్పీ, బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో ఇంకొల్లు పరిధిలోని ఇంకొల్లు ఆదర్శ పాఠశాలలో సోమవారం హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఇంకొల్లు, ఎస్ ఐ సురేష్, ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా శక్తి బృందం ఎస్ఐ ఏ. హరిబాబు మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందేందుకు శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ యాప్ ద్వారా ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు వంటి సంఘటనలను అరికట్టవచ్చని తెలిపారు.
అలాగే విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ, ఎవరైనా వేధింపులకు గురిచేస్తే వెంటనే తల్లిదండ్రులకు లేదా పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా వచ్చే ఫేక్ న్యూస్‌కు దూరంగా ఉండాలని హితవు పలికారు.
సమస్యలు ఎదురైనప్పుడు 100, 112, 181, 1091, 1098 వంటి హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పోక్సో చట్టం (చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం)పై, అలాగే మహిళల రక్షణకు అవసరమైన సెల్ఫ్ డిఫెన్స్ అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
 
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లా శక్తి బృందాలు పాఠశాల విద్యార్థులకు మరియు మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై స్పష్టమైన అవగాహన, డెమో ద్వారా సరైన స్పర్శ–అసహజ స్పర్శ మధ్య తేడా వివరించారు.
అత్యవసర సమయంలో తక్షణ సహాయానికి శక్తి యాప్  వినియోగంపై మార్గనిర్దేశం చేశారు.
Search
Categories
Read More
Andhra Pradesh
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి దుర్మరణం.
శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘటన ఆగి ఉన్న లారీని వేగంగా...
By Pagadala Venkateswar 2026-05-04 06:05:59 0 148
Andhra Pradesh
ఉచిత బస్సు రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తున్న మహిళలు.. బస్సులు నిలిపివేసిన అవనిగడ్డ సిబ్బంది.
అవనిగడ్డ బస్ డిపో వద్ద హఠాత్తుగా బస్సులు నిలిపివేసిన సిబ్బంది  మహిళా ప్రయాణికులు దురుసుగా...
By Pagadala Venkateswar 2026-06-25 06:22:40 0 95
Andhra Pradesh
గ్రామాల్లో ప్రతి కదలికపై నిఘా పెట్టాలి
గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు నివారణకు ప్రతి కదలికపై నిఘా పెట్టాలని మహిళా సంరక్షణ అధికారులను...
By Boiena Rajesh 2026-04-08 01:51:12 0 222
Andhra Pradesh
ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో గణ తంత్ర వేడు కలు
విశాఖ లోని మధుర వాడ లో ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం. జోనల్ -1 నందు గణ తంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు...
By Mobbu Venkatramana 2026-01-26 14:50:53 0 588
Maharashtra
Maharashtra Strengthens Disaster Management Preparedness
Maharashtra continues to strengthen its disaster management framework through advanced early...
By Fathima Safa 2026-07-02 09:42:16 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com