అల్వాల్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
193

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ మండల రెవెన్యూ అధికారి (MRO) కార్యాలయంలో ఈరోజు కళ్యాణ లక్ష్మీ పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాములు,  తెలంగాణ రాష్ట్ర ఎంబీసి (MBC) కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్  పాల్గొన్నారు.

నందికంటి శ్రీధర్  మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో మల్కాజిగిరి నియోజకవర్గం ముందుంటుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ గౌడ్ స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు ఆర్థిక వెసులుబాటు కల్పించినందుకు లబ్ధిదారులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదకరంగా గడిపే విధంగా బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు ఉండాలి నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే ఈవెంట్స్‌కు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలి
కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదకరంగా గడిపే విధంగా బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు ఉండాలి. నూతన...
By Gadiyapudi Narendra 2025-12-27 15:59:07 0 282
Andhra Pradesh
రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశానికి ఎమ్మెల్యే వేగేశన ను ఆహ్వానిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర
ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో రాష్ట్ర స్థాయిలో మాజీ...
By Vadlamudi NagaVenkat 2026-04-11 09:33:01 0 200
Andhra Pradesh
మధుర వాడ లో ఏ ఐ ఐ సి డయాసిస్ సమావేశం
  విశాఖ ప ట్న ము నందు మ దు ర వాడ లో ఇండియా ఇండిపెండెంట్ చ ర్సెస్ డ యోసిస్ స మావేశం శ ని వారం...
By Mobbu Venkatramana 2026-01-24 08:29:30 0 632
Andhra Pradesh
మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ముద్రగడ.....
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం ఆవెల్తీ గ్రామానికి చెందిన గోము చల్లయమ్మ గారి...
By BABJI DADALA 2026-03-02 14:21:12 0 523
Andhra Pradesh
మదనపల్లి లో పడిపోయిన టమాట ధరలు
మదనపల్లె టమాటా మార్కెట్లో 10 కిలోల బాక్స్ రూ.220కి పడిపోయింది. మార్కెట్‌కు మంగళవారం...
By Pagadala Venkateswar 2026-01-20 11:00:35 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com