India act responsibly said U S TREASURY SECRETARY

0
185

భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా ఆర్థిక మంత్రి

ఇరాన్‌ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ చక్కగా వ్యవహరిస్తోందంటూ అమెరికా కితాబిచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇటీవల ఆమోదం తెలిపిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ.. భారత్ బాధ్యతాయుతంగా నడుచుకుంటోందంటూ కితాబిచ్చారు.

 

భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా ఆర్థిక మంత్రి

Scott Bessent

 

 ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్ సహా పలు దేశాలకు చమురు సమస్యాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించిందంటూ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఇప్పటికే సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్‌కు అనుమతులిస్తున్నట్టు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. స్కాట్‌ ఈ విధంగా స్పందించారు.

 

'ప్రపంచ దేశాలకు చమురు సరఫరా బాగానే కొనసాగుతోంది. ఇప్పటికే సముద్ర మార్గంలో ఉన్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు మిత్ర దేశమైన భారత్‌కు అమెరికా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది' అని స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో 'భారత్‌ చాలా బాధ్యతగా వ్యవహరించింది. ముందుగా ఆంక్షలున్న రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని మేము కోరాం.. భారత్‌ ఆపివేసింది. ఆ తర్వాత అమెరికా నుంచి చమురు కొనాలని భారత్‌ నిర్ణయించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చమురు సరఫరాలో తాత్కాలికంగా లోటు ఏర్పడింది. దాన్ని భర్తీ చేసేందుకు రష్యా చమురును కొనేందుకు మేము భారత్‌కు అనుమతి ఇచ్చాం. త్వరలోనే రష్యా చమురుపై ఉన్న మరికొన్ని ఆంక్షలను కూడా తొలగించవచ్చు' అని ఆయన చెప్పారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్‌కు ఉపశమనం కలిగించేలా చర్యలు కొనసాగిస్తున్నామని స్కాట్ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మారిషస్ అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.
గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ సిటీలో...
By John Baji 2026-01-03 15:29:58 0 254
Telangana
అల్వాల్ చెరువు కట్ట పైన లైట్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  అల్వాల్ చెరువు కట్ట పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....
By Sidhu Maroju 2025-08-19 15:43:53 0 639
SURAKSHA
Idashisha Nongrang, IPS: Meghalaya's Trailblazing Leader
A distinguished 1992-batch Indian Police Service officer of the Assam–Meghalaya cadre,...
By Lokeshwari Panthadi 2026-07-22 13:37:30 0 179
Telangana
భగీరథ్ అరెస్ట్ అవుతారా? రేపు కీలక తీర్పు?
బాదితురాలు 2021లో రాప్స్ ఫిర్యాదు చేసింది, అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లు అని బండి భగీరథ్ లాయర్...
By Ponnala Srinivasrao 2026-05-15 03:31:47 0 157
Andhra Pradesh
దుర్గ గుడిలో జరుగుతున్న వరుస ఆపచారాలకు ప్రాయశ్చిత్తంగా కామధేను అమ్మవారి వద్ద వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు
విజయవాడ  12-01-2026   ప్రచురణార్ధం   దుర్గ గుడిలో జరుగుతున్న వరుస అపచారాలకు...
By Rajini Kumari 2026-01-12 13:15:41 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com