తెలంగాణ రుచి- జాతీయ వేదికపై రికార్డు సృష్టి. |

0
198

హైదరాబాద్: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వంటల పోటీ ‘మాస్టర్‌చెఫ్ ఇండియా’ సీజన్-10లో తెలంగాణకు చెందిన తల్లి, కూతుళ్ల జోడీ అద్భుత ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించింది.

మంచిర్యాల జిల్లాకు చెందిన రాచకొండ సాయిశ్రీ మరియు ఆమె తల్లి చందన ఈ పోటీలో రన్నరప్‌లుగా నిలిచి తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని చాటారు.

మాస్టర్‌చెఫ్ ఇండియా చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘జోడీ ఫార్మాట్’లో వీరిద్దరూ పాల్గొని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. 

వేలాది మంది పోటీ పడిన ఈ సీజన్‌లో సాయి శ్రీ, చందన తమ వంటల నైపుణ్యంతో అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్–12 మరియు టాప్–5 దశలను విజయవంతంగా దాటారు.

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్ పోరులో, ఈ తల్లి–కూతుళ్ల జోడీ తమదైన శైలిలో వంటలను రుచి చూపించి టాప్–2లో స్థానం సంపాదించుకున్నారు.

త్రుటిలో టైటిల్‌ను చేజార్చుకున్నప్పటికీ, దేశంలోనే అతిపెద్ద కుకరీ షోలో రన్నరప్‌లుగా నిలవడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక చిన్న జిల్లా నుంచి వచ్చి జాతీయ వేదికపై తెలంగాణ రుచులను, తమ ప్రతిభను చాటిన సాయిశ్రీ మరియు చందనలను పలువురు ప్రముఖులు అభినందించారు.

వీరి విజయం ఎంతో మంది ఔత్సాహిక వంట నిపుణులకు స్ఫూర్తిదాయకమని వారన్నారు 

#sidhumaroji

Alwal

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు పొందిన సందర్భంగా తేజస్ సౌర్య 2026 అభినందన వేడుక
కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి హనుమకొండ జూన్ 2025 ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మెరిట్...
By Thalakokkula Sadanandam 2026-06-05 13:26:44 0 2K
Andhra Pradesh
కరెంటు షాక్ తో రెండు ఏనుగులు మృతి
తిరుపతి ఎర్ర వారి పాలెం మండలం నెరబైలు పంచాయతీలో విషాదం నెలకొంది ఉదయం ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని...
By Benguluri Madhubabu 2026-03-09 09:50:31 0 221
Telangana
పెద్దపల్లి: ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల వెండి చోరీ
పెద్దపల్లి మండలం గొల్లపల్లి రాఘవపూర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి...
By Sunka Santhosh 2026-04-27 19:23:50 0 408
Haryana
Heavy Monsoon Alert: Rain and Storms Across Region
The India Meteorological Department (IMD) has issued a significant alert, forecasting an...
By Lokeshwari Panthadi 2026-07-01 08:54:31 0 200
Andhra Pradesh
Chandrababu Naidu: ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... రాష్ట్రంలో భారీగా భూ కేటాయింపులు... పరిశ్రమలు, విద్యాలయాలకు పెద్దపీట.
      Chandrababu Naidu: ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... రాష్ట్రంలో భారీగా భూ...
By Pagadala Venkateswar 2026-03-13 12:54:18 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com