పాత ఇంటి యజమాని దాస్తీకం- మనోవేదనతో యువతి ఆత్మహత్య .|

1
435

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పాత ఇంటి యజమాని పెట్టిన మానసిక వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆల్వాల్  పోలీస్  స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

 

హస్మత్‌పేట్‌లోని మాలా బస్తీకి చెందిన షేక్ సాబర్ (46), పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య తబస్సుమ్ (62). వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. గత 21 ఏళ్లుగా హస్మత్‌పేట్‌లోని అబ్రహార్ మసీదు సమీపంలో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్న ఈ కుటుంబం, రెండు రోజుల క్రితమే మాలా బస్తీలోని కొత్త ఇంటికి మారింది.

 

ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో, తబస్సుమ్ పాత ఇంట్లో మిగిలిపోయిన బట్టలు, సామాన్లు శుభ్రం చేయడానికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంటి యజమాని మోటార్ పాడైందని, అడ్వాన్స్ డబ్బుల విషయంలో తనను తీవ్రంగా వేధిస్తున్నాడని, అంతేకాకుండా భర్త ఇంట్లో లేని సమయంలో తలుపులు కొట్టి లోపలికి వస్తూ ఇబ్బంది పెడుతున్నాడని ఆమె తన భర్తకు వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పంపింది.

 

యజమాని వేధింపుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన తబస్సుమ్, అదే రోజు సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఎవరూ లేని సమయంలో పాత ఇంటి వంటగదిలో ఇనుప పైపుకు చున్నీతో ఉరివేసుకుంది.

గమనించిన షేక్ యాకూబ్ అనే వ్యక్తి ఆమెను కిందికి దించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త షేక్ సాబర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

తన భార్య మరణానికి కారణమైన ఇంటి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం పోలీసులను కోరుతోంది..

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
ఎంపీ కేశినేని శివనాద్ కార్యాలయంలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం.
*ప్ర‌చుర‌ణార్థం* *11-01-2026*   తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న...
By Rajini Kumari 2026-01-11 09:35:20 0 231
Andhra Pradesh
చింతచెట్టు పైనుంచి పడి యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం, గంగన్నగారిపల్లికి చెందిన రవి (38) అనే యువకుడు నిమ్మనపల్లి రోడ్డులోని...
By Pagadala Venkateswar 2026-03-10 08:47:12 0 313
Telangana
"సేవ పక్షం" కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్.    “సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ జన్మదిన...
By Sidhu Maroju 2025-09-20 14:25:21 0 339
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:నా వద్ద అన్ని ప్రూఫ్ లు ఉన్నాయి.. బీపీఎం
తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం...
By Kothuru Murali 2026-02-24 11:08:13 0 198
Andhra Pradesh
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల శ్రీవారి చెంత భక్తుల రద్దీ కొనసాగుతుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు అన్ని...
By Benguluri Madhubabu 2026-02-27 03:44:46 0 248
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com