మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల పరిహారం చెల్లించాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి
Posted 2026-05-06 15:06:59
0
231
మంచిర్యాల జిల్లాలో రైతుల మరణం ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి అన్నారు. లక్సెట్టిపేట మండలం గంపాలపల్లి, కొత్తూర్ గ్రామాల్లో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షం . కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం పై కవర్లు కప్పడానికి వెళ్లిన నలుగురు రైతులు గోడ కూలి మరణించారు. వారి మృతదేహాలను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన రఘనాథ్ రావు మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతుల కుంటుబాలకు ప్రభుత్వం ఒక్కక్కరికి తక్షణమే ₹ 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మిల్లర్లతో కుమ్మక్కయ్యారని అన్నారు. అందుకే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందన్నారు. వెంటనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆంధ్రప్రదేశ్ పోలీస్ చట్టం, 1861లోని సెక్షన్ 30 ప్రకారo 03.02.2026
గుంటూరు జిల్లాలో శాంతిభద్రతలను, శాంతిని మరియు ప్రశాంతతను కాపాడటానికి మరియు ప్రజల రాకపోకలను...
పుంగునూరు నియోజకవర్గం :నారా లోకేష్‌ను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసుల నాయుడు
అన్నమయ్య జిల్లా సోమల మండలం, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసుల నాయుడు విజయవాడలో నారా...
Chandigarh’s Speed Limit Signs Under Scanner After Major Errors Found
In a recent city-wide audit, the Chandigarh traffic police found alarming inconsistencies in...
'స్త్రీ శక్తి' థీమ్‌తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు.
'స్త్రీ శక్తి' థీమ్‌తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు
Andhra...
వైసీపీ ర్యాలీకు అనుమతులు లేవు: సీఐ
బొబ్బిలి పట్టణంలో వైసీపీ ర్యాలీ, ధర్నాకు ఎటువంటి అనుమతులు లేవని బొబ్బలి పట్టణ సీఐ కె.నారాయణరావు...