వైసిపి నెయ్యి అంశం పక్కదారి పట్టించేందుకు హెరిటేజ్ పై దుష్ప్రచారం

0
187

*ప్రచురణార్థం* *20-02-2026*

 

*వైసిపి కల్తీ నెయ్యి అంశం ప‌క్క దారిప‌ట్టించేందుకే హెరిటేజ్‌పై దుష్ప్రచారం: టిడిపి నాయ‌కుడు మాదిగాని గురునాథం*

 

*ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో మీడియా సమావేశం*

 

*బ్లూ మీడియా త‌ప్పుడు క‌థ‌నాల‌పై ఢిల్లీ హై కోర్ట్ మందలించిన వైసిపి నాయ‌కుల‌కు బుద్ది రాలేదు*

 

*ప్రజలు అన్నీ గమనిస్తున్నారు… మ‌రోసారి బుద్ది చెప్ప‌టం ఖాయం*

 

*హెరిటేజ్‌పై దుష్ప్రచారం ఆపాలంటూ హెచ్చరిక*

 

 

విజయవాడ: తిరుమ‌ల కల్తీ నెయ్యి వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఆ అంశం ప‌క్క దారి ప‌ట్టించేందుకు స్వార్థ రాజ‌కీయ ప్రయోజ‌నాల కోసం కల్తీ నెయ్యి వ్యవహారంలోకి కావాలనే నారా భువ‌నేశ్వ‌రి న‌డుపుతున్న హెరిటెజ్ సంస్థ పై వైసిపి నాయ‌కులు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని టిడిపి నాయ‌కుడు మాదిగాని గురునాథం మండిప‌డ్డారు.

 

వైసిపి నాయ‌కులు హెరిటెజ్ సంస్ధ పై చేసిన అస‌త్య ఆరోప‌ణ‌లు ఖండిస్తూ శుక్ర‌వారం గురునాన‌క్ కాల‌నీలోని ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో టిడిపి నాయ‌కుడు మాదిగాని గురునాథం మీడియా సమావేశం నిర్వ‌హించారు.

 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వైయస్సార్‌సీపీ నేతల ఆరోపణలు “దొంగే దొంగ అని అరుస్తున్నట్లు” ఉన్నాయని విమర్శించారు. స్వార్థ రాజకీయ లాభాల కోసం వైసిపి నాయ‌కుడు బొత్స సత్యనారాయణ, మీడియా దృష్టి ఆకర్షించేందుకు హెరిటేజ్‌పై బురద జల్లుతున్నారని ఆరోపించారు. ఎంత దుష్ప్రచారం చేసినా ప్ర‌జ‌లు న‌మ్మ‌టానికి సిద్దంగా లేర‌న్నారు. ఈ నెల 14 వ తేదీన బ్లూ మీడియా ప‌త్రిక‌లో ప్రచురించిన కథనాలను సోష‌ల్ మీడియాలో తొలగించాలని ఢిల్లీ హైకోర్టు చెప్పినా, కోర్టు ఆదేశాలను వైసీపీ బేఖాతరు చేసి... విమర్శలకు దిగుతోందని గురునాథం ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ సంస్థ రూ.100 కోట్ల పరువు నష్టం దావా కూడా దాఖలు చేసినట్లు తెలిపారు. శాసనమండలిలో వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరూపించమంటే... వాకౌట్ చేస్తూ బయటకు వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు.

 

.హెరిటేజ్ సంస్థను నారా భువనేశ్వరి సుమారు 33 సంవత్సరాల క్రితం కేవలం రూ.4 కోట్ల పెట్టుబడితో ప్రారంభించగా, ఈ సంస్థ 4 వేల కోట్ల టర్నోవర్‌తో ఎదిగి, దాదాపు మూడు లక్షల మంది పాడి రైతులకు ఆదాయ వనరుగా నిలుస్తోందన్నారు. నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, 300 మందికి పైగా నిపుణులతో ఉత్పత్తుల పరీక్షలు నిర్వహించే పారదర్శక వ్యవస్థగా హెరిటేజ్ నిలిచిందని వివరించారు

 

హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేని సంస్థలను కలిపి చూపిస్తూ వైయస్సార్‌సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బోలే బాబా మిల్క్ ప్రొడక్ట్స్ కు హెరిటేజ్‌తో సంబంధం వుంద‌ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నార‌న్నారు. అదే విధంగా ఇందాపుర్ సంస్థకూ హెరిటేజ్‌తో ఎలాంటి సంబంధం లేదని, ఆ సంస్థ ప్రతినిధులే స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. హెరిటెజ్ సంస్థ తొమ్మిది రాష్ట్రాల్లో పారదర్శకమైన ఉత్పత్తులతో ముందుకెళ్తోందని వివరించారు. వైసిపి హ‌యంలో బ్లూ మీడియా భారతి సిమెంట్స్ వంటి సంస్థలకు అనుకూలంగా వ్యవహరించిన విషయాలు అందరికీ తెలిసినవేనని అన్నారు. వైసీపీ నాయ‌కులు చేసిన ఆరోపణలకు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని... ఏపీలో వైసీపీ మనుగడ సాగించలేదని గురునాథం దుయ్యబట్టారు.సీఎంగా చంద్ర‌బాబు నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శక పరిపాలన కొనసాగుతుందని పేర్కొన్నారు.

 

ఈ మీడియా సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బ‌న్ కో-ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌ర‌సింహా చౌద‌రి, టిడిపి క్రిస్టియ‌న్ నాయ‌కులు ఇత్త‌డి చార్లెస్ పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Prateek Jain IAS: Championing Good Governance
A Young Telangana IAS Officer Empowering Citizens with Transparent Administration and Inclusive...
By Lokeshwari Panthadi 2026-07-15 14:10:03 0 172
Andhra Pradesh
కారులో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ – దర్శకుడిపై కేసు
కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతిని వెబ్ సిరీస్‌లో అవకాశం కల్పిస్తానని నమ్మించి మోసం చేసిన ఘటన...
By Ratna Sekhar 2026-03-08 17:37:15 0 1K
Andhra Pradesh
కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గం పల్లె కృష్ణ CTIU తాడేపల్లి మండలం కన్వీనర్
కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గం.    పల్లె కృష్ణ, సిఐటియు తాడేపల్లి...
By Rajini Kumari 2025-12-20 13:49:07 0 247
SURAKSHA
Odisha Police Help Elderly Lost In Market Area
Today Odisha Police helped a 75-year-old woman lost near Bhubaneswar Market Building. Officers...
By Kalaga Sailaja 2026-07-06 07:29:28 0 245
SURAKSHA
. Community Policing and Public Awareness
​Content: Karnataka Police goes beyond just law enforcement by connecting with the public through...
By Kalaga Sailaja 2026-06-29 11:24:01 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com