Sunil Nayak: ఐపీఎస్ సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్.

0
168

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు

బీహార్ కేడర్ ఐపీఎస్ సునీల్ నాయక్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన గుంటూరు కోర్టు

సునీల్ నాయక్ కోసం పాట్నాలోనే మకాం వేసిన ఏపీ పోలీసులు

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పోలీస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు సంబంధించి గుంటూరు న్యాయస్థానం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా విచారణకు గైర్హాజరవుతున్న సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం బీహార్‌లో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న నాయక్‌ను తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు ఇప్పటికే పాట్నాలో పాగా వేశారు.

 

 

గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ రఘురామను అరెస్ట్ చేసిన సమయంలో, కస్టడీలో ఆయనపై అమానుషంగా భౌతిక దాడి జరిగిందన్న ఆరోపణలపై నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా పోలీసులు నిన్న కోర్టులో వారెంట్ పిటిషన్ దాఖలు చేయగా, నిందితుడి సహాయ నిరాకరణను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తక్షణమే అరెస్ట్ వారెంట్‌కు పచ్చజెండా ఊపింది.

 

 

అయితే, బీహార్‌లో సునీల్ నాయక్‌పై అరెస్ట్ ప్రక్రియ ఉత్కంఠకు దారితీస్తోంది. ఇప్పటికే ఏపీ పోలీసు బృందం పాట్నాలో ఆయనను అదుపులోకి తీసుకుని, ఏపీకి తీసుకొచ్చేందుకు అక్కడి కోర్టులో ట్రాన్సిట్ పిటిషన్ వేయగా... ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. అంతేకాదు, నెల రోజుల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవద్దని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా ఉన్నట్టు సమాచారం.

 

 

 

 

తాజాగా గుంటూరు కోర్టు సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో, ఏపీ పోలీసులు మరింత పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. ఆ ఐపీఎస్ అధికారిని పట్టుకునేందుకు బీహార్ పోలీస్ యంత్రాంగం సహకారం కోరుతూ, వీలైనంత త్వరగా ఆయనను గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. 

Search
Categories
Read More
Rangareddy
విలీనమైనా మారని నిర్మాణాల తీరు పంచాయతీ నిబంధనల పేరుతోనే నిర్మాణాలు.. సెట్బ్యాక్‌లు లేకుండా G+2, G+3 భవనాలు.పార్కింగ్ లేక.. రోడ్లపైనే వాహనాలు.
దుండిగల్–గండిమైసమ్మ మండలం, మల్లంపేట:సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మల్లంపేట గ్రామం...
By Ponnala Srinivasrao 2026-08-08 03:54:23 0 130
SURAKSHA
Pillar of Justice: The Remarkable Journey of IPS Dr. Prafulla Kumar Roushan
From Academic Excellence to Iron-Clad Security: How a Visionary Officer is Shaping Modern Law...
By Kalaga Sailaja 2026-07-27 06:14:17 0 156
Telangana
కరీంనగర్ : యువతి పైకి దూసుకెళ్లిన క్రేన్...!
కరీంనగర్ నగరంలోని గీత భవన్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు దిగి రోడ్డు దాటుతున్న...
By Sunka Santhosh 2026-06-12 18:41:56 0 141
Telangana
నిజామాబాద్ బైపాస్ రోడ్డులో రేపు ప్రారంభం కానున్న PAIDE Conventionను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నేడు సందర్శించారు.
PAIDE Convention యజమాని, ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారి సోదరుడు శ్రీ పైడి రాజ...
By Sadaq Sadaq 2026-08-20 16:35:40 0 121
Mizoram
Mizoram Accelerates Economic Growth and Investment Drive
Mizoram continues to strengthen its economy by promoting investments in infrastructure, tourism,...
By Fathima Safa 2026-07-01 11:02:48 0 71
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com