• అగ్నిప్రమాద బాధితులను ఆర్థిక సాయం
    బొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాద బాధితులను ఎమ్మెల్యే బేబినాయన బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కంచాలు, దుప్పట్లు అందించి ఆర్థిక సహాయం చేశారు. అగ్నిప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. #RAJESH 
    0 Comments 0 Shares 90 Views 0 Reviews
  • ఎమ్మెల్యే కళాపై జడ్పీ ఛైర్మన్ ఫైర్
    చీపురుపల్లి MLA కళా వెంకట్రావు ఇటీవల బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యక్తిగత దూషణలను జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రాజాంలో విలేకరుల సమావేశంలో ఖండించారు. మూలపేట పోర్టు అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సరికాదు అంటూ మండిపడ్డారు. వ్యక్తిగత దూషణల కోసం మాట్లాడితే తాము కూడా మాట్లాడటం పెద్ద పనేం కాదంటూ హెచ్చరించారు....
    0 Comments 0 Shares 77 Views 0 Reviews
  • అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
    బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. బొబ్బిలి కోటలో బుధవారం మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా పని చేయాలన్నారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు మంజూరు చేయాలన్నారు.గొల్లపల్లి,పాతబొబ్బిలి గ్రామదేవత పండుగలకు సంపూర్ణంగా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. #RAJESH 
    0 Comments 0 Shares 80 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 42 Views 0 Reviews
  • రాజేంద్రనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం (హరి హర క్షేత్రం)ఈ నెల 4న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని కమిటీ ప్రతినిధులు శాంతాబాయోటెక్ ఎండీ డా కే వరప్రసాద్ గారికి ఆహ్వానం అందచేశారు. కమిటీ ప్రతినిధులు బాలరాజ్, డా అమరేందర్, రామకృష్ణ, శ్రీకాంత్, కమల్ పాల్గొన్నారు
    రాజేంద్రనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం (హరి హర క్షేత్రం)ఈ నెల 4న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని కమిటీ ప్రతినిధులు శాంతాబాయోటెక్ ఎండీ డా కే వరప్రసాద్ గారికి ఆహ్వానం అందచేశారు. కమిటీ ప్రతినిధులు బాలరాజ్, డా అమరేందర్, రామకృష్ణ, శ్రీకాంత్, కమల్ పాల్గొన్నారు
    0 Comments 0 Shares 161 Views 0 Reviews
  • నెలవాడలో అర్ధరాత్రి దొంగల బీభత్సం..!
    బొండపల్లి మండలం నెలవాడలో షేక్ రసూల్ ఇంట్లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. సమాచారం అందుకున్న బొండపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫొరెన్సిక్ బృందం ఇంట్లో వేలిముద్రలను సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. #RAJESH 
    0 Comments 0 Shares 78 Views 0 Reviews
  • బర్త్ సర్టిఫికేట్ జారీలో అలసత్వం తగదు
    వృద్ధులకు బర్త్ సర్టిఫికేట్ జారీలో అలసత్వం తగదని జన జాగృతి ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీరపు శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అతిధి గజపతికి వినతిపత్రం అందించారు. విజయనగరంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమెను కలిసి వృద్ధులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. జిల్లాలో ఈ సమస్యతో 3,733 మంది వృద్ధలు ఇబ్బంది పడుతున్నారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. #RAJESH 
    0 Comments 0 Shares 67 Views 0 Reviews
  • గవరమ్మపేట పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచారం
    గవరమ్మపేట గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. గ్రామస్థులు, రైతులు పొలాల్లోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఏనుగులు కనిపించినప్పుడు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. #RAJESH 
    0 Comments 0 Shares 79 Views 0 Reviews
  • రాజేంద్రనగర్ శ్రీరామ భక్తుల హనుమాన్ ర్యాలీ
    రాజేంద్రనగర్ శ్రీరామ భక్తుల హనుమాన్ ర్యాలీ
    0 Comments 0 Shares 80 Views 0 0 Reviews
  • పెళ్లి కార్డులో సీఎం ఫోటోలు ముద్రించి ఆహ్వానం పలికిన TDP నేత.
    మదనపల్లె మండలం పనసమాకులపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు జి. వి. నాయుడు, తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే షాజహాన్ బాషా తదితరుల ఫోటోలను ముద్రించి ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. ఈ నెల 8, 9 తేదీల్లో మదనపల్లెలోని ఆర్ఆర్ కళ్యాణ మండపంలో వివాహ వేడుకలు జరగనున్నాయి. పార్టీపై తనకున్న అభిమానంతోనే ఈ విధంగా ఆహ్వాన పత్రికను రూపొందించినట్లు...
    0 Comments 0 Shares 58 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com