Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • చింతూరులో తృటిలో తప్పిన పెను ప్రమాదం: మంటల్లో దగ్ధమైన గూడ్స్ లారీ!
    చింతూరు మార్గంలో బుధవారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుండి చింతూరు వైపు వెళ్తున్న ఒక గూడ్స్ లారీ (నెంబర్: CG 18S 8034) ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది.మారేడుమిల్లి నుండి చింతూరు వైపు ఘాటీ దిగి తులసిపాక రాగానే, లారీ వెనుక వైపు ఉన్న టైర్ల నుండి ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. లారీ డ్రైవర్ గమనించే లోపే ఆ నిప్పురవ్వలు కాస్తా పెద్ద మంటలుగా మారి, క్షణాల వ్యవధిలోనే వాహనం...
    349 Views
  • SRP3&3A గని SOM కి మెమోరాండం అందించిన TBGKS నాయకులు
    శ్రీరాంపూర్ జూన్ 03 : బుధవారం రోజున SRP3&3A ఇంక్లైన్స్లో ఉదయం 7 గంటలకి తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో గని SOM కి మెమొరాండం సమర్పించిన యూనియన్ నాయకులు.  ప్రధాన డిమాండ్లు:- ➡️ప్రతినెల రెండు మెడికల్‌ బోర్డులను నిరంతరాయంగా నిర్వహించాలి. ➡️ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి తక్షణమే నియామక ఉత్తర్వులు ఇవ్వాలి. ➡️విజిలెన్స్‌ మరియు మారుపేర్ల సమస్యను...
    312 Views
  • జూన్ 7 గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా - సండేస్ ఆన్ సైకిల్ ప్రోగ్రాం
    తెలంగాణ జూన్ 3 : క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌స్) ఆధ్వర్యంలో జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ పోస్టర్ ను ఆవిష్కరించిన చైర్మన్ శివసేన రెడ్డి, వీసీ & ఎండీ సోని బాల దేవి,ఈ...
    390 Views
  • గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతూ పట్టుబడిన ఇద్దరు నిందితులు.. పరారీలో మరో ఇద్దరు
    రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా,విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పట్టుకుని,వారి వద్ద నుంచి గంజాయి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ పోలీసు సిబ్బందితో కలిసి బీ పవర్ హౌస్ టర్నింగ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా,బోరే కిషన్ (26), రామగుండం, లింగంపల్లి శ్రావణ్ కుమార్ (26), ఇందిరమ్మ కాలనీ,...
    326 Views
  • చింతూరు పోలీసుల తనిఖీలో గంజాయితో పట్టుబడ్డ యువకులు!
    చింతూరు మండలం మోటు జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒకే స్కూటీపై అనుమానాస్పదంగా వస్తున్న ముగ్గురు యువకులను ఆపి తనిఖీ చేయగా అసలు రంగు బయటపడింది. వారి వద్ద నుంచి ఏకంగా 4 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.వీరంతా ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు పట్టుబడిన ముగ్గురు యువకులు...
    316 Views
  • పుంగనూరు హైవే పై ఎంవీఐ సుప్రియ తనిఖీలు
    ముంబై-చెన్నై హైవేలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ వాహనాలను బుధవారం తనిఖీ చేశారు. అన్నమయ్య జిల్లా, పుంగనూరులో ఓవర్ లోడ్, సరైన రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు. పర్మిట్, ఫిట్నెస్, పొల్యూషన్, లైసెన్స్ తప్పనిసరి అని, పరిమితికి మించి వాహనాలు నడపరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు#...
    220 Views
  • జూన్ 7 గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా - సండేస్ ఆన్ సైకిల్ ప్రోగ్రాం
    తెలంగాణ జూన్ 3 : క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌స్) ఆధ్వర్యంలో జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ పోస్టర్ ను ఆవిష్కరించిన చైర్మన్ శివసేన రెడ్డి, వీసీ & ఎండీ సోని బాల దేవి,ఈ...
    90 Views
  • తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హైదరాబాద్ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ కార్యాలయ ప్రాంగణంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో ఉద్యోగ బంధువులు, కేంద్ర మరియు జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    ఉదయం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ:
    తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం హైదరాబాద్ జిల్లా యూనియన్ ప్రాంగణంలో శ్రీ విక్రమ్ కుమార్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాలు, ఉద్యోగుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, ఆ నాడు ఉద్యమకారుల చూపిన బాటలోనే నేడు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

    సాయంత్రం ప్రధాన ఉత్సవాలు - కేక్ కట్టింగ్:
    సాయంత్రం జరిగిన ఉత్సవాలకు టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్) గారు ఒక ప్రత్యేక కేక్‌ను సిద్ధం చేయగా, ముఖ్య అతిథి మరియు ఇతర నేతల సమక్షంలో ఆ కేక్‌ను కట్ చేసి అందరికీ తీపి తినిపించారు.

    కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ ప్రసంగం:
    ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ మారం జగదీశ్వర్ గారు మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో ఉద్యోగుల పోరాట పటిమను, అలుపెరగని దీక్షను గుర్తుచేసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం నూతనంగా ప్రతిపాదించిన ఆరోగ్య పథకం (EHS) అమల్లోకి వచ్చేలా కేంద్ర సంఘం చేసిన అగణిత కృషిని, పడిన శ్రమను ఆయన ఉద్యోగులకు వివరించారు. ఎటువంటి ప్రీమియం భారం లేకుండా స్వతంత్ర ట్రస్ట్ ఆధారిత ఈహెచ్ఎస్ రావడం ఉద్యోగుల విజయమని పేర్కొన్నారు.

    ఇదే వేదికగా ఆయన ఒక కీలకమైన పిలుపునిచ్చారు. కొందరు ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా ఈహెచ్ఎస్ (EHS) పథకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అలాంటి వారి మాటలను నమ్మవద్దని మరియు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని ఉద్యోగులను కోరారు. పథకం మరింత పటిష్టంగా మారేందుకు ప్రభుత్వానికి అవసరమైన సవరణలను సూచిస్తున్నామే తప్ప, పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాలను ఎవరూ ప్రోత్సహించవద్దని ఆయన హెచ్చరించారు.

    ఉద్యమ జ్ఞాపకాలను నెమరవేసుకున్న డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్):
    తదనంతరం డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్) గారు మాట్లాడుతూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓల పాత్రను, నాడు సకల జనుల సమ్మె కాలంలో అనుభవించిన క్లిష్ట పరిస్థితులను భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ఆనాటి పోరాట స్ఫూర్తిని నిరంతరం కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు.

    పాల్గొన్న ప్రముఖులు:
    ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం ట్రెజరర్ శ్రీమతి ఉమ, క్లాస్-IV కేంద్ర అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ ఖాదర్ బిన్ హసన్, నాగర్ కర్నూల్ అధ్యక్షులు శ్రీ బి. వెంకటేష్, నల్గొండ అధ్యక్షులు శ్రీ ఎన్. మురళి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీ కూరాడి శ్రీనివాస్, నల్గొండ జిల్లా కార్యదర్శి శ్రీ శేఖర్ రెడ్డి, మరియు నాయకులు శ్రీ పి. వరద రాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ కె.ఆర్. రాజ్ కుమార్ గారు పాల్గొన్నారు.

    వీరితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ ఖాలెద్ అహ్మద్, శ్రీ బి. శంకర్, శ్రీమతి జి. గీత, శ్రీ వైదిక్ శ్రేష్ట, శ్రీ ముఖీం ఖురేషి, శ్రీ ఎ.వి. శ్రీధర్, మరియు కేంద్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కొండల్ రెడ్డి, శ్రీ గోవర్ధన్ రెడ్డి, శ్రీమతి అనురాధ, శ్రీమతి వరలక్ష్మి లతో పాటు వివిధ యూనిట్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మరియు పెద్ద సంఖ్యలో ప్రాథమిక సభ్యులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
    662 Views
  • ఫుడ్ పార్క్ భూముల్లో 'అక్రమాల' కలకలం!

    అసైన్డ్ భూమిని ప్రైవేట్ పట్టాగా మార్చేందుకు యత్నం?

    సర్వేను అడ్డుకుంటున్న వైనం.. ఆర్‌డీఓకు ఫిర్యాదు


    హుజూర్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన అగ్రికల్చర్ ప్రాసెసింగ్ జోన్ (ఫుడ్ పార్క్) భూసేకరణ ప్రక్రియ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఫుడ్ పార్క్ కొరకు మండల పరిధిలోని సర్వే నెంబర్ 1041లో ప్రభుత్వం నోటిఫై చేసిన 140 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తుండగా, ఓ కీలక ప్రభుత్వేతర అధికారికి చెందిన అసైన్డ్ భూమి విషయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందడం స్థానికంగా కలకలం రేపుతోంది.
    హుజూర్ నగర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం విధులు నిర్వహిస్తున్న పులిచింతల నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి సదరు సర్వే నెంబర్ 1041లో దాదాపు 35 గుంటల అసైన్డ్ భూమి ఉంది. అయితే, సదరు వ్యక్తికి తెల్ల రేషన్ కార్డు లేకపోవడం, ఇతర ప్రైవేటు పట్టా భూములు కలిగి ఉండటంతో నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూసేకరణలో నష్టపరిహారం దక్కదనే ఆందోళన మొదలైంది. దీనికి తోడు ఫుడ్ పార్క్ ఏర్పాటు కానుండటంతో చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో సదరు అసైన్డ్ భూమిని పక్కనే ఉన్న ప్రైవేట్ పట్టా సర్వే నెంబర్ లో కలిపేసి, భూమిని ప్రైవేటు పట్టాగా మార్చుకునేందుకు వెలిదండ వీరారెడ్డి అనే వ్యక్తితో కలిసి సదరు సీఈఓ చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అధికారులు సదరు 35 గుంటల భూమిని సర్వే చేయకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఈ అక్రమ మార్గం ద్వారా భూమిని భారీ ధరకు అమ్ముకోవాలనే దురాశతోనే ఈ వ్యవహారానికి తెరలేపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
    ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిని ప్రైవేట్ పట్టాగా మార్చే ప్రయత్నాలపై స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) కి లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి, సదరు వ్యక్తి ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అతనికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకూడదని డిమాండ్ చేశారు. ఒకవేళ స్థానిక అధికారులు ఈ అక్రమాలపై స్పందించకుంటే సూర్యాపేట జిల్లా కలెక్టర్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
    838 Views
  • నిజామాబాద్
    పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో పేద వారికి ఇళ్ళు ఇవ్వలేని అసమర్థ పాలన నడిచింది,నవిపేట్ ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం లో ప్రభుత్వ సలహాదారులు,ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు....
    253 Views