రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చల్లా బాబును పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలానికి చెందిన పలువురు కూటమి నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రొంపిచర్ల పర్యటనలో భాగంగా మంత్రిని కలిసిన నాయకులు, మండలంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాయకులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం# కొత్తూరు మురళి.
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం కంభంవారిపల్లి పంచాయతీలో నిర్మించిన కొత్తచెరువు ప్రాజెక్టుతో భూములు కోల్పోయిన రైతులు, పరిహారం అందడంలో జాప్యం కావడంతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీల సహకారంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు రెండు రోజులుగా పరిహారం వారి ఖాతాల్లో జమ అవుతోంది. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చేసిన సహాయానికి రైతులు శనివారం తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద...
రాయచోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారి సమావేశం చైర్మన్ శివగంగ రెడ్డి అధ్యక్షతన జరిగింది ముఖ్యంగా ఎన్జీవో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మడితాటి వేణుగోపాల్ రెడ్డి గారు డాక్టర్ నాగిరెడ్డి గారు పాల్గొన్నార ఏప్రిల్ నెలలో జరగాల్సినటువంటి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది
పుంగనూరు మండలంలోని మర్సనపల్లికి చెందిన మంగమ్మ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ. 60,000 విలువైన చెక్కును శనివారం మండల సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పురి రమేష్ పార్టీ శ్రేణులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబుకు, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి.
ఈరోజు టి సుండు పల్లి మండలంలో పెద్దబలిజ పల్లి గ్రామం గుట్టకాడపల్లి మల్లక్క గారి పల్లి ఏటిగడ్డ రాచపల్లి గ్రామస్తులు ఇసుక క్వారీ వల్ల తమ బోర్లు ఎండిపోతున్నాయని సాగునీరు తాగునీరు లేకుండా పోతున్నాయని పెద్దబలిజ పల్లి గ్రామస్తులు సుమారు 500 మంది రైతులు ఇసుక క్వారీని అడ్డుకున్నారు ఇసుక క్వారీ 500 మీటర్లు పరిమిషన్ ఇస్తే ఐదు కిలోమీటర్లు తవ్వి వేశారని రైతులు వాపోయారు
హైదరాబాద్ : వేసవి సెలవులు ప్రారంభం కావడంతో నగరంలోని స్విమ్మింగ్ పూల్స్ పిల్లల కేరింతలతో కిటకిటలాడుతున్నాయి. కుటుంబాలతో కలిసి పెద్ద సంఖ్యలో ప్రజలు పూల్స్‌ను సందర్శిస్తుండటంతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
అయితే, ఈ సందడి వెనుక ఉన్న నిర్వాహకుల నిర్లక్ష్యం, భద్రతా లోపాలు పసిపిల్లలతో పాటు యువత ప్రాణాలకూ ముప్పుగా మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇటీవల ఆల్వాల్ ప్రాంతంలో జరిగిన...
మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నాయకులు అడుగులు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ రోజు మల్కాజిగిరి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించబడింది.
ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు, ముఖ్య కార్యకర్తలు...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం భవన నిర్మాణ నిబంధనలలో (Building Rules) కీలక మార్పులు చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యంగా బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కుల (TDR) వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, హై-రైజ్ భవనాల ఎత్తు పరిమితిని సవరిస్తూ పురపాలక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
హై-రైజ్ భవనాల ఎత్తు పెంపు:
ఇప్పటివరకు 18 మీటర్ల...
చీరాల: చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు రూరల్ సీఐ శేషగిరిరావు గారు వేటపాలెం ఎస్సై జనార్ధన్ గారుశక్తి టీం ఎస్సై హరిబాబు మరియు కానిస్టేబుల్ కే. సుబ్బారావు, వేటపాలెం మండలం లోని వివేరా బీచ్ ఏరియా నందు శక్తి యాప్ వినియోగంపై, మాదకద్రవ్యాల ప్రమాదాలపై, డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారం, అలాగే పోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సుబ్బారావు మాట్లాడుతూ అకస్మాత్తుగా జరిగే...