Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అన్నమయ్య జిల్లాలో గ్యాస్ కొరత లేదన్న జెసి.
    అన్నమయ్య జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, 31 గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ శనివారం తెలిపారు. గ్యాస్ సరఫరాపై సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని, జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ఫిర్యాదులకు స్పందిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువులోనే బుకింగ్ చేయాలని,...
    290 Views
  • Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం: తిరుమలలో సీఎం చంద్రబాబు.
        Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం: తిరుమలలో సీఎం చంద్రబాబు 21-03-2026 Sat 19:34 | Andhra Chandrababu Naidu Focuses on Tirumala Temple Sanctity and Pilgrim Services     కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడటం, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే తమ ప్రభుత్వ ప్రథమ...
    343 Views
  • కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాజాసింగ్ లేఖ : తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు. |
      హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యవసర లేఖ రాశారు. రాబోయే రామ నవమి శోభాయాత్ర నేపథ్యంలో తనకు, తన కుటుంబానికి తీవ్రమైన ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ నంబర్ల నుండి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఒక లేఖ ద్వారా తన కుమారుడిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ...
    311 Views
  • కోతులను తరిమే ప్రయత్నంలో ప్రమాదం: రైతు తీవ్రంగా గాయపాటు.
    మదనపల్లి మండలంలో శనివారం మధ్యాహ్నం జరిగిన సంఘటనలో, చీకిలబైలు గ్రామానికి చెందిన రైతు చిన్నయ్య తన పంటలను కోతుల బారి నుండి కాపాడుకునేందుకు తారాజువ్వలు వెలిగించాడు. దురదృష్టవశాత్తు, ఒక తారాజువ్వ అతని తొడలోకి దూసుకెళ్లి పేలిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
    306 Views
  • అల్వాల్ పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సమాజ రక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసుల సేవలను గుర్తించడం అభినందనీయమని పలువురు కొనియాడారు.  శనివారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ సీతారామ నామ సంకీర్తన సంఘం ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ఘన సన్మానం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిదని, ప్రజల భద్రత కోసం వారు చేస్తున్న కృషిని అభినందిస్తూ సంఘం...
    Love
    1
    350 Views
  • నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల
    నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల గలగలలు చూసి మనసు పులకించిన సందర్భం ,అపర భగీరథుడు కేసీఆర్ గారి చారిత్రాత్మక కృషితో వేసవి లోనూ రైతన్నల కళ్లలో అంతులేని ఉత్సాహం
    314 Views
  • మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన
    కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కావడం లేదని, గత 20 ఏళ్లుగా పేద, కార్మిక, కష్టజీవులకు రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఆశా వర్కర్లు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆశలకు ఫిక్స్‌డ్ వేతనాలు, ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని చర్చించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా...
    355 Views
  • చేపల వేటలో ప్రమాదం – వృద్ధుడికి తీవ్ర గాయాలు.
    మదనపల్లి మండలంలో శనివారం జరిగిన సంఘటనలో, సిటిఎం ప్రాంతానికి చెందిన ఎర్రప్ప (60) అనే వృద్ధుడు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు బండరాయిపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మల్రెడ్డి చెరువు సమీపంలో చోటుచేసుకుంది. గమనించిన పశువుల కాపరులు వెంటనే స్పందించి, అతన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
    455 Views
  • ప్రైవేట్ ఆస్పత్రులే టార్గెట్ – మదనపల్లెలో దొంగ సంచలనం.
    మదనపల్లెలో అర్ధరాత్రి వేళ ఆస్పత్రుల్లోకి చొరబడి క్యాష్ పెట్టెల్లోని డబ్బును దొంగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి సీటీఎం రోడ్డులోని ఓ ఆస్పత్రిలో దొంగతనం యత్నం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రైవేట్ వైద్యులు భయాందోళనల్లో ఉన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వివిధ ఆస్పత్రుల సీసీ కెమెరా ఫుటేజీలను సేకరిస్తున్నారు....
    294 Views
  • గోదావరిలో మునిగిన విద్యార్థికి ఎమ్మెల్యే నివాళి.
    భద్రాచలం వద్ద గోదావరి నదిలో మునిగి మృతి చెందిన విద్యార్థి సతీష్ మృతదేహం ఆదివారం వేకువజామున స్వగ్రామానికి చేరుకుంది. సమాచారం అందుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష వెంటనే పోతబోలు గ్రామం, కొయ్యలవారిపల్లికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మృతుడి తల్లిదండ్రులను పరామర్శించి, ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
    305 Views