Bharat Aawaz

నందిగామ 21వ వార్డులో అచ్చి దివ్య విస్తృత ప్రచారం...!!

Patan Khuddus
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
82
Views

🟡21వ వార్డు ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారమే, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు అచ్చి దివ్య...

నందిగామ, అక్టోబర్ 21: నందిగామ మున్సిపాలిటీ 21వ వార్డులో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అచ్చి దివ్య విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలను నేరుగా కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా అచ్చి దివ్య మాట్లాడుతూ.. వార్డు ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని, వార్డు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆదరణతో కౌన్సిలర్‌గా గెలుపొందితే వార్డు సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య నాయకత్వంలో నందిగామ నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, అదే స్ఫూర్తితో 21వ వార్డును అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. తనను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపించడంతో పాటు, నందిగామ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శాఖమూరి వంశీకి కూడా ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.

🟡విస్తృత ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు

ఈ ప్రచార కార్యక్రమంలో నందిగామ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శాఖమూరి వంశీ సతీమణి స్వర్ణలత, అచ్చి పెద్దబాబు, అచ్చి చిన్నబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్డు ప్రజలను కలుసుకుంటూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.