Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • తెనాలిలో పోలీసుల కార్టెన్ సెర్చ్....
    తెనాలిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు బుధవారం కార్టెన్ సెర్చ్ చేపట్టారు. రౌడీషీటర్లను, అనుమానితులను తనిఖీ చేసి వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నెంబరు  ప్లేట్స్ లేని వాహనాలను తనిఖీ చేశారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానస్పద వ్యక్తులు, కొత్త వ్యక్తులు ఊర్లో కనిపిస్తే 112 కు సమాచారము ఇవ్వాల్సిందిగా సూచించారు.
    133 Views
  • మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఖరారు
    తెనాలి మున్సిపాలిటీలో 52 వార్డులకు ఎస్సీ, ఎస్టీమహిళ, బీసీ రిజర్వేషన్లు జిల్లా కలెక్టర్ ఖరారు చేశారు. అక్టోబర్ 13న విడుదలైన గెజిట్ ప్రకారం ఎస్టీలకు రెండు, ఎస్సీలకు ఏడు, బీసీలకు 17,మహిళలకు 14 వార్డులు కేటాయించారు.12 వార్డులను రిజర్వేషన్ నుంచి మినహాయించారు.దీనితో మునిసిపల్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. 
    135 Views
  • పత్తి చేలల్లో గంజాయి సాగు యువత భవిష్యత్తు నాశనం కాకుండా అరికట్టాలి
    🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి):  ఆసిఫాబాద్ సిఐ నీలం రవి గారికి డివైఎఫ్ఐ (DYFI) వినతి డివైఎఫ్ఐ (DYFI) ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ సిఐ నీలం రవి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆసిఫాబాద్ మండల కేంద్రంలో గల గ్రామాల యందు పత్తి చేనులో గంజాయి మొక్కలు పెంచుతూ దానిని కోతకు వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాలకు కొంతమంది గంజాయి స్మగ్లర్లు యువతను టార్గెట్ చేసుకొని వారికి విక్రయిస్తున్నారు. యువత...
    176 Views
  • తెనాలిలో ఆర్ఆర్ కాలనీ చినరావూరు పార్కులను కమిషనర్ తనిఖీలు
    మునిసిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆర్ఆర్ కాలనీలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.కార్మికులతో మాట్లాడి తగిన సూచనలు చేశారు.ఇంటింటి చెత్త సేకరణకు వాడుతున్న ఈ ఆటోల పనితీరును తనిఖీ చేశారు.అనంతరం వారు చినరావూరు పార్కును  సందర్శించారు. ఇక్కడ పచ్చదనంపై సిబ్బంది,సూపర్వైజర్ తో మాట్లాడారు. పార్కును అందంగా,పరిశుభ్రంగా ఉంచాలని,ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా...
    142 Views
  • ఆసిఫాబాద్ జనకాపూర్ 1వ వార్డులో విద్యుత్ స్తంభాల ఏర్పాటు కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ చొరవ
    🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్  న్యూస్ ప్రతినిధి): ఆసిఫాబాద్ మునిసిపల్ పరిధిలోని  జనకాపూర్ 1వ వార్డులో ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని  కొత్త విద్యుత్ స్తంభాలను  దగ్గరుండి ఏర్పాటు చేయించారు. వార్డులో విద్యుత్ సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా కౌన్సిలర్ గారు నిరంతరం కృషి...
    173 Views
  • భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మాదాసు స్వామి యాదవ్ ఏర్పాటుచేసిన ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

    2014 తర్వాత దేశంలో అన్ని రంగాల్లో పెనుమార్పులు సంతరించుకున్నాయి. భారతదేశ జీడీపీ ప్రపంచంలో 10వ స్థానం నుంచి ఏకంగా 4వ స్థానానికి రావడం ప్రధాని మోదీ గారి పాలన వల్లే సాధ్యమైంది. కేంద్ర పథకాల వల్ల దేశంలోని కోట్ల మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారు.
    107 Views
  • హాజీపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ ఎ.భాస్కర్
    మంచిర్యాల జోన్ పరిధిలోని హాజీపూర్ పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, రికార్డులు, పెండింగ్ కేసుల ఫైళ్లను పరిశీలించారు. కేసుల దర్యాప్తు పురోగతిపై ఎస్‌ఐ కిరణ్ కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని డీసీపీ...
    83 Views
  • మంచిర్యాలలో అక్రమ పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి నలుగురు అదుపులో.. రూ.40,300 నగదు, మూడు సెల్‌ఫోన్లు, స్కూటీ స్వాధీనం
    మంచిర్యాల: పట్టణంలోని కాలేజ్ రోడ్డులో హరినిలయ విల్లాస్ వెనుక ప్రాంతంలో డబ్బులు పందెంగా పెట్టి అక్రమంగా పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం నార్కోటిక్ టీమ్/టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్‌ఐ లక్ష్మణ్ రావు, మంచిర్యాల టౌన్ పోలీసులతో కలిసి చేపట్టిన ఈ సంయుక్త దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.ఈ...
    84 Views
  • ఘనంగా ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి క్రీడా పోటీలు శ్రీరాంపూర్‌లో షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ పోటీలు
    శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలో రెండు రోజులపాటు నిర్వహించిన సింగరేణి కంపెనీ స్థాయి షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ పోటీలు ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, సమన్వయం, టీమ్‌వర్క్‌ను పెంపొందిస్తాయని తెలిపారు....
    89 Views
  • జైపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ అంబర్ కిషోర్ ఝా
    జైపూర్: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం జైపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధుల తీరు, సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల నమోదు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం వహించరాదని, రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్‌లో 5S మేనేజ్‌మెంట్ విధానాన్ని...
    99 Views