Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
-
-
-
*నేడు దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ..*
*ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి*
అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణకు ఉమ్మడి కార్యచరణ రూపొందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు సమన్వయ సమావేశం *ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) నిర్వహించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.*
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. *తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లకు చెందిన డీజీపీలు, ఐజీలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ, సీబీఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు.* ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసు శాఖలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు, పరస్పర సహకారం, సమన్వయంతో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు..45 Views -
Thamballapalle: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, వాహనాలను నాశనం చేయడం, జనసేన, టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడటాన్ని మదనపల్లె జనసేన నాయకుడు జంగాల శివరాం రాయల్ తీవ్రంగా ఖండించారు. కర్రలు, ఇనుప ముళ్లు ఉన్న ఆయుధాలతో దాడులు చేయడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జంగాల శివరాం మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ శ్రేణులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రాజకీయ విభేదాలను హింసాత్మక చర్యల ద్వారా పరిష్కరించుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.48 Views
-
మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీ 15వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్ విజయమే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపైకి వచ్చారు. కూటమి అభ్యర్థి గెలుపు కోసం సమష్టిగా కృషి చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వార్డులోని ప్రజలను కలిసి తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్ మాట్లాడుతూ.. 15వ వార్డు అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తన విజయానికి ఐక్యంగా కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే వార్డును అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.46 Views