Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పలాస వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా బమ్మిడి దుర్యోధన రావు (B.D. RAO) ప్రకటన
    పలాస వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా బమ్మిడి దుర్యోధన రావు (B.D. RAO) ప్రకటన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్ఫూర్తితో, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆశీస్సులతో ప్రజాక్షేత్రంలోకి... పదవి కోసం కాదు.. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రాజకీయం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమే నా పక్షం: బీడీ రావు స్పష్టీకరణ   పలాస: పలాస మండల సమగ్ర అభివృద్ధి, ప్రజల...
    195 Views
  • అల్పపీడనం.. నేడు భారీ వర్షాలు: APSDMA
    AP: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది ఎల్లుండికి బలపడి వాయుగుండంగా మారుతుందని APSDMA అంచనా వేసింది. ఆ తదుపరి 3 రోజుల్లో మరింతగా బలపడి కోస్తాంధ్ర తీరం చేరొచ్చని తెలిపింది. ఇవాళ రాయలసీమతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, రేపు, ఎల్లుండి అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. సోమవారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వానలు పడతాయని తెలిపింది.
    112 Views
  • చిత్తూరు: నామినేషన్లకు నేడే ఆఖరు
    జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ల దాఖలు చేయడానికి శుక్రవారం ఆఖరు తేదీ. చిత్తూరులోని జెడ్పీ నామినేషన్ కేంద్రంలో ఆర్వో రవికుమార్ నాయుడు నామినేషన్లను స్వీకరించారు. జిల్లాలో రెండు రోజుల్లో జెడ్పీటీసీ స్థానాలకు 97 మంది, ఎంపీటీసీ స్థానాలకు 1,014 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణకు ఈరోజు సాయంత్రం ఐదు వరకు సమయం ఉంది.
    103 Views
  • పలాస ఎంపీపీ అభ్యర్థిగా కుత్తుం రూపవతి
     కూటమి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష   అన్ని ఎంపీటీసీ స్థానాల్లో గెలిచి ఎమ్మెల్యేకు కానుకగా అందిస్తాం: కుత్తుం లక్ష్మణ్ పలాస: పలాస మండల పరిషత్ అధ్యక్ష పదవికి కూటమి అభ్యర్థిగా కుత్తుం రూపవతిని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష అధికారికంగా ప్రకటించారు. పలాస మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ్ సతీమణి అయిన రూపవతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో మండల...
    97 Views
  • దసరా వేడుకల్లో పాలపిట్ట విడుదలపై ప్రశ్నలు
      సామాన్య ప్రజలకే నిబంధనలా? ప్రజాప్రతినిధులకు వర్తించవా?   హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై ఇప్పుడు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ, అటవీశాఖ నిబంధనలు, చట్టాల అమలు విషయంలో సామాన్య ప్రజలకు ఒక రకమైన నిబంధనలు, రాజకీయ నాయకులకు మరో రకమైన నిబంధనలు ఉంటాయా? అనే చర్చకు ఈ ఘటన దారితీసింది.   దసరా పండుగ సందర్భంగా పాలపిట్టను విడుదల చేసిన...
    88 Views
  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు – ఓటరు నమోదు చేసుకున్నారా?
    హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన   హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు తమ ఓటరు నమోదు ప్రక్రియపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.   మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకున్నారా? మీ ఎన్రోల్మెంట్...
    96 Views
  • *నేడు దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ..*

    *ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి*

    అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణకు ఉమ్మడి కార్యచరణ రూపొందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు సమన్వయ సమావేశం *ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) నిర్వహించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.*
    ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. *తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లకు చెందిన డీజీపీలు, ఐజీలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్‌ఐఏ, సీబీఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు.* ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసు శాఖలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు, పరస్పర సహకారం, సమన్వయంతో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు..
    46 Views
  • Thamballapalle: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, వాహనాలను నాశనం చేయడం, జనసేన, టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడటాన్ని మదనపల్లె జనసేన నాయకుడు జంగాల శివరాం రాయల్ తీవ్రంగా ఖండించారు. కర్రలు, ఇనుప ముళ్లు ఉన్న ఆయుధాలతో దాడులు చేయడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జంగాల శివరాం మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ శ్రేణులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రాజకీయ విభేదాలను హింసాత్మక చర్యల ద్వారా పరిష్కరించుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.
    49 Views
  • మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీ 15వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్ విజయమే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపైకి వచ్చారు. కూటమి అభ్యర్థి గెలుపు కోసం సమష్టిగా కృషి చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వార్డులోని ప్రజలను కలిసి తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్ మాట్లాడుతూ.. 15వ వార్డు అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తన విజయానికి ఐక్యంగా కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే వార్డును అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
    47 Views