Bharat Aawaz
అల్పపీడనం.. నేడు భారీ వర్షాలు: APSDMA
AP: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది ఎల్లుండికి బలపడి వాయుగుండంగా మారుతుందని APSDMA అంచనా వేసింది. ఆ తదుపరి 3 రోజుల్లో మరింతగా బలపడి కోస్తాంధ్ర తీరం చేరొచ్చని తెలిపింది. ఇవాళ రాయలసీమతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, రేపు, ఎల్లుండి అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. సోమవారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వానలు పడతాయని తెలిపింది.
19 Views