Bharat Aawaz
*నేడు దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ..*

*ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి*

అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణకు ఉమ్మడి కార్యచరణ రూపొందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు సమన్వయ సమావేశం *ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) నిర్వహించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.*
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. *తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లకు చెందిన డీజీపీలు, ఐజీలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్‌ఐఏ, సీబీఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు.* ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసు శాఖలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు, పరస్పర సహకారం, సమన్వయంతో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు..
6 Views