Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Chittoor: ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
    చిత్తూరు: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన చిత్తూరుకు చెందిన మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ కుటుంబాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. పార్టీ కోసం పనిచేసిన వసంత కుమార్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వసంత కుమార్ శుభస్వీకరణ కార్యక్రమం సందర్భంగా ఆదివారం రాత్రి ఆయన నివాసానికి నారా లోకేష్ వెళ్లారు.ఈ సందర్భంగా వసంత కుమార్ చిత్రపటానికి...
    250 Views
  • స్థానిక సమరానికి టీడీపీ సై: 28 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన అధిష్ఠానం.
    ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సర్వసన్నద్ధమవుతోంది. ఈ దిశగా ఎన్నికల కసరత్తును వేగవంతం చేస్తూ, రాష్ట్రంలోని 28 జిల్లాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈసారి సరికొత్త వ్యూహాన్ని అనుసరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.   ఈసారి అభ్యర్థుల ఎంపిక బాధ్యతను సిట్టింగ్...
    233 Views
  • నెల్లూరులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఘనస్వాగతం.
    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సోమవారం నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ (రజతోత్సవ) వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, వై. సత్యకుమార్ సాదరంగా స్వాగతం పలికారు.   అక్షర విద్యాలయం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగిన యోగికి...
    226 Views
  • అమరావతిపై నాకు అభ్యంతరం లేదు.. మా పార్టీ సీఎం అభ్యర్థి నేను కాదు: విజయసాయిరెడ్డి.
    అమరావతిని రాజధానిగా ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. మనకు ఇష్టమున్నా లేకున్నా అమరావతిని రాష్ట్ర రాజధానిగా అంగీకరించి తీరాల్సిందే" అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన ఆయన... భవిష్యత్ కార్యాచరణపై మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.       ...
    220 Views
  • బొత్సపై విజయసాయిరెడ్డి ఫైర్
    తనను కేఏ పాల్తో పోల్చడంతో బొత్స సత్యనారాయణపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు.బొత్స ఎన్ని పార్టీలు మారారో, YSR, విజయమ్మలను ఎలా దూషించారో ప్రజలు గమనించాలన్నారు. బొత్స సత్యనారాయణది ఎంత దారుణమైన చరిత్రో గుర్తు చేసుకోవాలన్నారు. తాను, కేఏ పాల్ మంచి వాళ్లం కాదు అనేది అతని ఉద్దేశమా అని ప్రశ్నించారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన ఆయన.. దానికి తను CM అభ్యర్థిని కానని స్పష్టం చేశారు.
    461 Views
  • హన్మకొండ జిల్లా శాయంపేటలో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ దగ్ధం
    రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్ పై అత్యంత హేయంగా, అవమానకరంగా దూషిస్తూ, కించపరిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పదవినుండి తొలగించాలని, అలాగే శాసన సభ ఆవరణలో మహళా పోలీసుల ముందు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వికృత చేష్టలు సభ్య సమాజానికి తలవంపని శాయంపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు.ఈ సందర్భంగా శాయంపేట ప్రధాన కూడలిలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దిష్టిబొమ్మను దహనం చేశారు....
    364 Views
  • ఒకపక్క దోమల సమస్య మరోపక్క విద్యుత్ సమస్య
    నందవరం మండలం ముగతి గ్రామంలో ఒకపక్క దోమల సమస్య మరోపక్క విద్యుత్ కోతలు గ్రామాల్లో విద్యుత్ లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గ్రామాల్లో చాలా సమస్యగా మారింది విద్యుత్ సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది.
    344 Views
  • ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రోడ్డు దగ్గర ధర్నా
    DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, ఆదోని డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (DSF) విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్...
    339 Views
  • పేకాట స్థావరంపై పోలీసుల దాడి
    బలిజిపేట (M) నారంనాయుడు వలస గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై బలిజిపేట పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 5 మంది నిందితులను అదుపులోకి తీసుకుని రూ.8,220 స్వాధీనం చేసుకున్నారు.ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. అక్రమ జూదం, మద్యం, గంజాయి తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
    284 Views
  • చింతూరు మండలంలో జనసేనకు కీలక మైలురాయి – ఏరువాడ గిరిజన గ్రామానికి ₹10 కోట్ల నిధులు.. జనసేన చొరవతో అభివృద్ధికి బాటలు!
    చింతూరు మండలం ఏరువాడ గిరిజన గ్రామానికి రహదారి, పాఠశాల మౌలిక వసతులు, తాగునీటి సమస్యల పరిష్కారానికి దాదాపు ₹10 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏరువాడ గ్రామ ప్రజలు తమ సమస్యలను వీడియో రూపంలో తెలియజేయగా, ఆ సమస్యలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల దృష్టికి వెళ్లాయి. గిరిజన కుటుంబాల కనీస అవసరాలను నాగబాబు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి...
    301 Views