Bharat Aawaz

చింతూరు మండలంలో జనసేనకు కీలక మైలురాయి – ఏరువాడ గిరిజన గ్రామానికి ₹10 కోట్ల నిధులు.. జనసేన చొరవతో అభివృద్ధికి బాటలు!

Shyamala Yadagiri
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
273
Views

చింతూరు మండలం ఏరువాడ గిరిజన గ్రామానికి రహదారి, పాఠశాల మౌలిక వసతులు, తాగునీటి సమస్యల పరిష్కారానికి దాదాపు ₹10 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏరువాడ గ్రామ ప్రజలు తమ సమస్యలను వీడియో రూపంలో తెలియజేయగా, ఆ సమస్యలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల దృష్టికి వెళ్లాయి. గిరిజన కుటుంబాల కనీస అవసరాలను నాగబాబు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలకు ఆదేశాలు ఇచ్చినట్లు నాగబాబు తన X పోస్టులో పేర్కొన్నారు. ప్రధానంగా ఏరువాడ గ్రామానికి రహదారి అనుసంధానం కోసం దాదాపు ₹10 కోట్ల నిధులు మంజూరైనట్లు నాగబాబు వెల్లడించారు. అలాగే గ్రామంలోని పాఠశాల మౌలిక వసతులు, తాగునీరు, ఇతర అవసరమైన అభివృద్ధి పనులు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంత ప్రజల సమస్యలు నేరుగా ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లి వేగంగా స్పందన రావడం చింతూరు మండలానికి శుభ పరిణామం అని జనసేన నాయకులు పేర్కొన్నారు.“ప్రజల సమస్యలను విని.. అర్థం చేసుకుని.. బాధ్యత తీసుకుని.. వాటిని కార్యరూపంలోకి తీసుకురావడమే నిజమైన ప్రజా పాలన” అనే విధంగా నాగబాబు పవన్ కళ్యాణ్ స్పందనను అభినందించారు. ఏరువాడ ఘటనతో చింతూరు మండలంలోని మారుమూల గ్రామాల సమస్యలను కూడా జనసేన పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దిశగా మరింత చురుగ్గా పనిచేయాలనే సందేశం వెళ్లింది. జనసేన – ప్రజల సమస్యలకు అండగా.. అభివృద్ధికి ముందడుగుగా అంటూ చింతూరు మండల జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏరువాడకు దాదాపు ₹10 కోట్ల నిధుల మంజూరు అంశాన్ని అధికారికంగా ప్రస్తావిస్తూ నాగబాబు చేసిన X పోస్టు కూడా ఈ విషయానికి ప్రధాన ఆధారంగా నిలిచింది. 

 

# Yadagiri