Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నేడు అనుచరులతో కొండా సురేఖ భేటీ..

    వరంగల్‌: కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన అనంతరం మంత్రి కొండా సురేఖ వరంగల్‌ నియోజకవర్గంలోని తన అనుచరులతో నేడు సమావేశం కానున్నారు. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, తన ఢిల్లీ పర్యటన, పార్టీ అధిష్ఠానంతో జరిగిన చర్చలకు సంబంధించిన అంశాలను ఆమె అనుచరులకు వివరించే అవకాశం ఉంది.

    ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసిన సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలు, పార్టీలో నెలకొన్న పరిస్థితులు, తన కుటుంబంపై జరుగుతున్న విమర్శలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సురేఖ ఇప్పటికే వెల్లడించారు. అధిష్ఠానానికి చెప్పాల్సిన అన్ని విషయాలను స్పష్టంగా చెప్పానని ఆమె పేర్కొన్నారు.

    ఈ నేపథ్యంలో వరంగల్‌లో తనకు మద్దతుగా ఉన్న ముఖ్య నేతలు, కార్యకర్తలతో సురేఖ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది? పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? క్రమశిక్షణ కమిటీ వ్యవహారంపై అధిష్ఠానం వైఖరి ఏమిటి? వంటి అంశాలను ఆమె అనుచరులకు వివరించే అవకాశం ఉంది.

    ఇటీవల కొండా సురేఖ, ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఆమె వివరణ ఇచ్చారు. అయితే విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై, తన కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడం సరికాదని సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు.

    మరోవైపు, వరంగల్‌ నియోజకవర్గంలో తన రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణపై కూడా అనుచరులతో సురేఖ చర్చించే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో అనుచరుల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, పార్టీ కోసం కలిసి పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    కాగా, సురేఖతో భేటీకి నియోజకవర్గంలోని పలువురు ముఖ్య అనుచరులు, నాయకులు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం ఆమె నుంచి మరిన్ని కీలక వ్యాఖ్యలు వెలువడే అవకాశం ఉంది.
    751 Views
  • బ్రేకింగ్ న్యూస్

    రాజీనామా చేసే ఆలోచనలో కొండా సురేఖ

    అనుచరులతో చర్చించి మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు రానున్న కొండా దంపతులు

    అధిష్టానం నిర్ణయం కంటే ముందే రాజీనామా ప్రకటించే ఆలోచనలో కొండా సురేఖ

    పార్టీలో ఉండాలా లేదా అనే అంశంపై అనుచరులతో చర్చ
    Like
    1
    206 Views
  • వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి
    🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా విచ్ఛిన్నమైందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొమరం భీం జిల్లా మోవాడ్‌లో బిఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని,...
    Like
    1
    553 Views
  • లక్షెట్టిపేట పట్టణంలోని ఊట్కూర్ చౌరస్తాలో వంటావార్పు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్
    లక్షేటీపేట్  : కాంగ్రెస్ప్ర భుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను మరియు 420 హామీలను నెరవేర్చాలని ఈరోజు లక్షెట్టిపేట ఐబి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కార్యకర్తలతో మరియు నాయకులతో,మహిళలతో మరియు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం అందజేసి,వంటా వార్పు కార్యక్రమం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు...
    Like
    1
    275 Views
  • కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల డీసీసీ మాజీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
    మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో గల మంచిర్యాల గార్డెన్లో అభ్యాస జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారుఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తూ, విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. కొత్తగా కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులకు ఫ్రెషర్స్ డే...
    Like
    1
    297 Views
  • ప్రజల ఆస్తుల పరిరక్షణకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం: మర్రి.|
    ● కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ నిరసనలు ● 22-A బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ● మల్కాజ్‌గిరిలో బీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు యువకులు అల్వాల్, సెప్టెంబర్‌ 3: కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు...
    209 Views
  • 22A నిషేధిత భూములు రద్దు చేయాలనీ మంచిర్యాలలో బీజేపీ ధర్నా
    మంచిర్యాల :కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల భూములను దోపిడీ చేయడానికి తీసుకువచ్చిన 22A నిషేదిత భూముల జాబితాను రద్దు చేయాలని మరియు దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తు ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల RDO కార్యాలయం ఎదుట 22A బాధిత ప్రజలతో కలిసి నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రఘునాథ్ వెర్రబెల్లి పాల్గొన్నారు . గతంలో BRS ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరుతో...
    263 Views
  • వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కి వినతి
     మంచిర్యాల : తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం రోజున జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్కి ఏఎన్ఎంలు ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న 15 డిమాండ్లతో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా *మౌలాలి తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో...
    286 Views
  • రేవంత్ పాలనతో కాంగ్రెస్‌కు రాజకీయ గండం?
    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనపై ప్రతిపక్షాల విమర్శలు తీవ్రం.హామీల అమలు, పాలనా తీరుపై BRS–BJPల ప్రశ్నలు..కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కూడా పార్టీకి సవాలుగా మారుతున్నాయన్న చర్చ.రేవంత్ నాయకత్వం కాంగ్రెస్‌కు బలమా. బలహీనతా? 2029లో ప్రజల తీర్పు కీలకం.
    300 Views
  • వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.
    AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. సీబీఐకి అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరిని అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. దస్తగిరి సమర్పించిన బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలిస్తూ, రూ. 40 కోట్ల డీల్ వ్యవహారంలో నిజానిజాలను వెలికితీస్తున్నారు. గతంలో...
    211 Views