Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఓటర్ల హియరింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత
    🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్:  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై హియరింగ్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు.మంగళవారం నాడు తహశీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న హియరింగ్ ప్రక్రియను కలెక్టర్ స్వయంగా సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు నిర్వహిస్తున్న నోటీసులు, రికార్డు...
    531 Views
  • ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ నిరసనలు. ఎస్పీ నితిక పంత్‌కు వినతిపత్రం అందజేత
    🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా జిల్లాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాబోయే ఏడు రోజుల పాటు జిల్లా...
    662 Views
  • బొల్లారం ఆర్మీ క్యాంపులో భారీ ఆయుధాల చోరీ.|
    ● అత్యంత భద్రత మధ్య 12 ఆయుధాలు మాయం ● ఆదివారం రాత్రి చోరీ.. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు ● అంతర్గత వ్యక్తుల ప్రమేయంపై అనుమానాలు ఆల్వాల్, సెప్టెంబర్ 1: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంపులో భారీ ఆయుధాల చోరీ కలకలం రేపింది.  అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆయుధాల గదిలోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి 12 ఆయుధాలతో పాటు మందుగుండు...
    195 Views
  • జీహెచ్‌ఎంసీలో రూ.70 కోట్ల డబుల్ బిల్లుల బాగోతం.|
    ● ఒకే పనికి రెండుసార్లు చెల్లింపులు ● 11 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.7 కోట్లు రికవరీ ● ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్ చంద్రపై కమిషనర్ చర్య ఆల్వాల్, సెప్టెంబర్ 1: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒకే పనికి రెండుసార్లు బిల్లులు చెల్లించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విధంగా రూ.70 కోట్లకు పైగా నిధులు చెల్లించినట్లు గుర్తించారు. అదనపు మొత్తాన్ని తిరిగి రాబట్టే చర్యల్లో భాగంగా 11...
    280 Views
  • సెప్టెంబర్ 08 వ తేదీన SGF UNDER-14 & UNDER-17 కరాటే మరియు WUSHU UNDER - 17 బాల బాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
    మంచిర్యాల జిల్లా : పాఠశాల క్రీడా సమాఖ్య మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో అండర్ 14 & అండర్ 17బాల బాలికల కరాటే మరియు WUSHU ( అండర్ 17) జిల్లా స్థాయి ఎంపిక పోటీలు *ZPHS BOYS MANCHERIAL* వారి ఆధ్వర్యంలో లో సెప్టెంబర్ 08 తేదీ మంగళవారం రోజున నిర్వహించబడును అని జిల్లా అడిషనల్ కలెక్టర్ & జిల్లా విద్యాశాఖధికారి శ్రీ P. చంద్రయ్య IAS, SGF సెక్రటరీ యాకుబ్ తెలిపారు. ఇట్టి టోర్నమెంట్ కు కన్వీనర్ గా...
    279 Views
  • *కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు తొలగిన అడ్డంకులు*

    *స్టే ఎత్తివేస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు*

    కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై విధించిన స్టేను ఎత్తివేస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ పథకాల అమలుకు అడ్డంకులు తొలగినట్లైంది.
    263 Views
  • సెప్టెంబర్ 12న SGF చెస్ ఎంపిక పోటీలు
    మంచిర్యాల: పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాలబాలికల చెస్ ఎంపిక పోటీలు సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పి. చంద్రయ్య IAS, SGF సెక్రటరీ ఎం.డి. యాకూబ్ తెలిపారు.మంచిర్యాల కాలేజ్ రోడ్‌లోని MIMS Play & High School వేదికగా ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. అండర్-14 విభాగానికి 01-01-2013 లేదా ఆ...
    241 Views
  • వెలిగల్లులో నేటి నుంచి శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు.
    అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం, వెలిగల్లులోని నూతన శ్రీకృష్ణ ఆలయంలో సెప్టెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు 3 రోజుల పాటు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 2న గణపతి, నవగ్రహ పూజలు, కలశస్థాపన, 3న శ్రీకృష్ణుడి గ్రామోత్సవం, 4న శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. 4వ తేదీ మధ్యాహ్నం ఆలయం వద్ద భక్తులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలు...
    180 Views
  • పెద్దమండ్యంలోవైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు.
    పెద్దమండ్యం బస్టాండ్ సర్కిల్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను వైఎస్సార్సీపీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సోద్నపల్లి బాషా, మంచూరి జయరామ్, విశ్వనాథ్, కొసూరు రామకృష్ణ, మధుసూదన్ తదితర నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
    160 Views
  • Madanapalle: మదనపల్లెలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు; సెప్టెంబర్ 3న జరిగే వేడుకలకు హాజరుకావాలని బ్రహ్మకుమారి పద్మావతి పిలుపు.
    Madanapalle: మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో బ్రహ్మకుమారి పద్మావతి మాట్లాడుతూ: బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, మదనపల్లె ఆధ్వర్యంలో రేపు (సెప్టెంబర్ 3) శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.   శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణుడి ప్రసాదాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొని...
    147 Views