Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
    🎤భారత్ ఆవాజ్  కొమురం భీం ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అర్హులైన ప్రతి రేషన్ కార్డుదారుడికి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తామని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్ వేదికగా ఈ నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మొత్తం...
    270 Views
  • మల్కాజ్‌గిరిలో మువ్వన్నెల జెండా రెపరెపలు.. ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.|
    ● 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సందడి ● పలు ప్రాంతాల్లో జాతీయ పతాకావిష్కరణ.. అభివృద్ధి పనులకు శ్రీకారం ● దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపు మల్కాజ్‌గిరి, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి...
    323 Views
  • 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ గారు ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారికి గవర్నర్‌ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దంపతులు అతిథులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు.
    #IndependenceDay
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    1.2K Views
  • నిజామాబాద్
    ఈరోజు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ గారు మరియు పైడి రాకేష్ రెడ్డి గారుపాల్గొనడం జరిగింది.ప్రజలకు మరింత పారదర్శకంగా, సులభంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది.  
    206 Views
  • C M Revanth reddy attends Home function hosted by governor
    స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ లోక్ భవన్‌లో గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా గారి ఆతిథ్యంలో ఏర్పాటు చేసిన 'ఎట్ హోమ్' కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు   *YouTube* https://www.youtube.com/live/BtHJ3FaFbfM?si=9EWHQBx9xgm12Yqs   *X* https://x.com/TelanganaCMO/status/2088610639363403933?s=20   *Facebook*...
    310 Views
  • నందవరం మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ
    నందవరం మండల కేంద్రంలో MPUP స్కూల్ నిర్వహించిన 80స్వాతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంఈఓ రఘునాథ్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది .స్కూల్ హెడ్మాస్టర్ MD శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది దేశ నాయకులు త్యాగాల వల్ల స్వాతంత్రం వచ్చింది.   దేశ భవిష్యత్తు, విద్యార్థులు యువత చేతిలో ఉంటుంది. పేదరికం ,అవినీతి, అసమానత,...
    321 Views
  • సూర్యమోహన్ దౌల్తాబాద్ మండల్ రిపోర్టర్
    ​భావపూర్వక శ్రద్ధాంజలి ​శ్రీమతి కమ్మరి కాలమ్మ గారికి ​మా ప్రియతమ అమ్మమ్మ గారు, మీరు మాకు పంచిన ఆప్యాయతలు, చూపిన ప్రేమ ఎప్పటికీ మా మదిలో నిలిచి ఉంటాయి. మీరు లేని లోటు మమ్మల్ని తీవ్రంగా కలచివేస్తోంది. మీ దివ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ... అశ్రునయనాలతో నివాళులర్పిస్తున్నాము.
    376 Views
  • రాజాపేట ఎస్ఐకి పోలీస్ సేవా పతకం
    బోనగిరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజపేట ఎస్సై మహమ్మద్ తక్యుద్దీన్ కి ప్రతిష్టాత్మక తెలంగాణ పోలీస్ సేవ పథకాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా సూపరిండెంట్ ఆకాంక్ష యాదవ్ అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఐ తక్యుద్దీన్ కు పలువురు అభినందనలు తెలిపారు
    342 Views