Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • బాబాపూర్ గ్రామానికి విచ్చేసిన ఆసిఫాబాద్ నూతన సీఐ నీలం రవి గారికి గ్రామస్తుల ఘన స్వాగతం
    🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆగస్టు 01:  ఆసిఫాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నీలం రవి గారు బాబాపూర్ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ సత్రవేణి. రాజన్న గారి ఆధ్వర్యంలో వార్డు ప్రతినిధులు, యువత నూతన సీఐకి పుష్పగుచ్ఛాలు అందించి మర్యాదపూర్వకంగా...
    462 Views
  • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ మెగా ఆపరేషన్. నెల రోజుల్లో 74 మంది బాల కార్మికులకు విముక్తి
    🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి,జగదీష్,: ఆసిఫాబాద్:కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-XII ప్రత్యేక డ్రైవ్ విజయవంతంగా ముగిసింది. జూలై 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు నెల రోజుల పాటు సాగిన ఈ ప్రత్యేక ఆపరేషన్ వివరాలను జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ అధికారికంగా వెల్లడించారు.మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ,...
    460 Views
  • ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందును కలిసిన ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
    🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు జిల్లా క్రీడా పాఠశాలకు విచ్చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ITDA) ప్రాజెక్ట్ అధికారి గౌరవ శ్రీ మంద మకరందు గారిని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు ఆసిఫాబాద్ నియోజకవర్గము లోని మారుమూల ప్రాంతాల అభివృద్ధి గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల కురిసిన...
    445 Views
  • గోదావరి - శబరి ఉగ్రరూపం: పోలవరం జిల్లాలో వరద బీభత్సం!
    గోదావరి, శబరి నదులు పోటెత్తడంతో పోలవరం జిల్లా చింతూరు మండలం వి,ఆర్,పురం మండలం కూనవరం మండలం ఎటపాక మండలం లొ వరద నీరు ముంచెత్తింది. పలు గ్రామాలు నీటమునిగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోగా, అధికారులు సహాయక చర్యలను తీవ్రతరం చేశారు. రహదారులు జలమయం జిల్లాలోని 44 ప్రధాన రహదారులు వరద నీటిలో చిక్కుకున్నాయి. బాధిత గ్రామాలు మొత్తం 10 గ్రామాలపై వరద తీవ్ర ప్రభావం చూపింది. అందులో 9 గ్రామాలు నీట...
    286 Views
  • కర్నూలు జిల్లాలో వైసీపీ-టీడీపీ ఘర్షణ.. ఎమ్మెల్యే విరూపాక్షిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    కర్నూలు జిల్లాలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలు ఉద్రిక్తతకు దారితీశాయి. సంగాల, నేమకల్ గ్రామాల్లో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

    సంగాల గ్రామంలో వైసీపీ నేత గిరితో పాటు ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు నేమకల్ గ్రామంలో టీడీపీ కన్వీనర్ కారును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ ఘటనలతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం శాంతిభద్రతల దృష్ట్యా ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిప్పగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

    ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి, ఘర్షణలకు కారణమైన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు. ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
    290 Views
  • C M Revanth reddy at ujjain mahankali temple
    సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల (లష్కర్ బోనాల) జాతరలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు  *YouTube* https://www.youtube.com/live/CsEfB51f6n0?si=ftVxVOYD-6JUHUrq   *X* https://x.com/TelanganaCMO/status/2083814223784898877?s=20   *Facebook* https://www.facebook.com/share/v/1CevARusWU/
    298 Views
  • ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో తక్షణ స్పందన. పైప్‌లైన్ లీకేజీ సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్ రాపర్తి కార్తీక్
    🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ మరోసారి నిరూపించారు. గత కొన్ని రోజులుగా 11వ వార్డు పరిధిలో ప్రధాన పైప్‌లైన్ లీకేజీ కారణంగా తాగునీరు వృథా కావడంతో పాటు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ తక్షణమే స్పందించి, మున్సిపల్ అధికారుల...
    496 Views
  • నిజామాబాద్
    ఇందూరు భక్తజనంతో నిండిపోయింది..గ్రామ దేవతల ఊరేగింపుతో పరవశించింది..ఆషాఢ మాసం మూడో ఆదివారం నిర్వహించిన "ఊర పండగ "లో     ఎమ్మెల్యే ధన్‌పాల్ శ్రియానారాయణ పాల్గొనడం జరిగింది. నగరంలోని ఖిల్లా రామాలయం అమ్మవార్ల గద్దె నుంచి గాజుల్ పేట్ " సరి " గుళ్ల, పెద్ద బజార్ మీదుగా కొనసాగిన శోభాయాత్ర ఆధ్యాంతం ఆనందం కలిగించింది. పోతురాజుల విన్యాసం, అమ్మవార్ల తొట్టెలతో ఘనంగా జరిగింది.
    256 Views
  • ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో పాల్గొన్న..మంత్రి మండిపల్లి
    *అన్నమయ్య జిల్లా*  *రాయచోటి నియోజకవర్గం* *తేదీ: 02-08-2026*   *'ఇంటింటికీ టీడీపీ – రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం' కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు*   రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని 25, 26వ వార్డుల్లో నిర్వహించిన *'ఇంటింటికీ టీడీపీ – రెండేళ్ల నమ్మకం,*...
    486 Views