Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • తెనాలి. బిజిగా ఉన్నా...... విచారణకు రాలేను. అన్నాబత్తుని...
    తెనాలి. స్థానిక సంస్థల ఎన్నికల పనుల కారణంగా పోలీసుల విచారణకు హాజరు కాలేనని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా తెనాలి వన్టౌన్ సీఐ కి సమాచారం అందించారు. వైసిపి ఇన్చార్జిగా అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈనెల 23న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.అన్నాబత్తుని 14న తొలి విచారణకు వెళ్లారు.
    120 Views
  • తెనాలి పి ఓ,ఏపీఓ ల సిక్షనను పరిశీలించి న కమిషనర్....
    తెనాలి. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పిఓ, ఏపీఓల శిక్షణను కమిషనర్ రామ అప్పలనాయుడు పరిశీలించారు.ఎన్నికలకు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ, సామాగ్రి వినియోగంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. పొరపాట్లకు తావు లేకుండా సిబ్బంది సమన్వయంతో,బాధ్యతగా పనిచేసీ ఎన్నికలను సజావుగా విజయవంతం చేయాలని అధికారులను సూచించారు.
    135 Views
  • తెనాలిలో కూటమి చైర్మన్ అభ్యర్థిగా తోటకూర రమణారావు
    తెనాలి.మున్సిపాలిటీ ఎన్నికల కూటమి సీట్ల పంపకంలో జనసేన పార్టీకి కేటాయించారు. దీంతో కూటమి తరపున జనసేన అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. తెనాలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త,కాపు నేత,కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ర్ తోటకూర వెంకట రమణారావు ఖరారయ్యారు. ఈ ప్రకటనతో తెనాలి రాజకీయాల్లో ఎన్నికల వేడి పెరిగింది.పోటీ ఆసక్తికరంగా మారనుంది.
    127 Views
  • బెల్లంపల్లి ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించిన సీపీ అంబర్ కిషోర్ ఝా
    బెల్లంపల్లి, శనివారం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం బెల్లంపల్లి ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించి నిర్వహణ తీరును సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా హెడ్ క్వార్టర్స్‌లోని ఆర్‌ఐ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, స్టోర్ రూమ్, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆర్‌ఐ సంపత్‌తో సమావేశమై హెడ్ క్వార్టర్స్‌లో విధులు...
    104 Views
  • నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న INTUC కేంద్ర నాయకులు – కార్మికుల సంక్షేమమే లక్ష్యమని వెల్లడి
    శ్రీరాంపూర్: దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరాంపూర్ ఏరియాలోని SRP OC, SRP-3 గనుల పరిధిలో ఉన్న మైసమ్మ ఆలయాల్లో చండీయాగం, మహా అన్నదాన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా INTUC సీనియర్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, బెల్లంపల్లి రీజియన్ ఇన్‌చార్జి, సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపల్లి సమ్మన్న, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్...
    100 Views
  • నిజామాబాద్ నగరంలోని దుర్గామాత మండపాలు, ఆలయాలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

    నిజామాబాద్ నగరం: ఈరోజు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నిజామాబాద్ నగరంలోని వివిధ దుర్గామాత మండపాలు, ఆలయాలను సందర్శించి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ చైర్మెన్ పాల్తి రవి మరియు వారి కమిటీ ఆహ్వానం మేరకు కిషన్‌గంజ్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని నూతనంగా తీసుకొచ్చిన శ్రీ చక్రానికి అభిషేకం నిర్వహించారు.

    వినాయక్ నగర్‌లోని BRS పార్టీ 22వ డివిజన్ అధ్యక్షులు మాకు రవి ఆహ్వానం మేరకు వారి కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకున్నారు.

    పార్టీ 25వ డివిజన్ అధ్యక్షులు చింతకాయల రాజు ఆహ్వానం మేరకు కోటగల్లిలోని శ్రీ కట్ట మైసమ్మ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవార్ల ఆశీస్సులు పొందారు.

    ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
    #navaratri #dasara
    163 Views
  • నిజామాబాద్ నగరంలోని దుర్గామాత మండపాలు, ఆలయాలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
    : ఈరోజు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నిజామాబాద్ నగరంలోని వివిధ దుర్గామాత మండపాలు, ఆలయాలను సందర్శించి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ చైర్మెన్ పాల్తి రవి మరియు వారి కమిటీ ఆహ్వానం మేరకు కిషన్‌గంజ్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని నూతనంగా తీసుకొచ్చిన శ్రీ చక్రానికి అభిషేకం నిర్వహించారు.

    వినాయక్ నగర్‌లోని BRS పార్టీ 22వ డివిజన్ అధ్యక్షులు మాకు రవి ఆహ్వానం మేరకు వారి కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకున్నారు.

    పార్టీ 25వ డివిజన్ అధ్యక్షులు చింతకాయల రాజు ఆహ్వానం మేరకు కోటగల్లిలోని శ్రీ కట్ట మైసమ్మ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవార్ల ఆశీస్సులు పొందారు.

    ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
    #navaratri #dasara
    165 Views
  • నవీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

    నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం అనువైన పరిస్థితులను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి శనివారం ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పబ్లిక్ స్కూల్ కోసం అందుబాటులో ఉన్న స్థలం, ఇతర వసతులను పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని వసతులు, అధునాతన సౌకర్యాలతో 3 ఎకరాల విస్తీర్ణంలో ఒకే చోట ఒకటవ తరగతి నుండి 12 తరగతి వరకు నాణ్యమైన విద్యా బోధన జరిగేలా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. దీని నిర్మాణం కోసం రూ. 9.76 కోట్ల నిధులు కేటాయించారని వెల్లడించారు.
    అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మించదల్చిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు.

    యంచ ఫిల్టర్ బెడ్ పరిశీలన

    కాగా, నవీపేట మండలం యంచ వద్ద గల మిషన్ భగీరథ న్యాల్కల్ పంప్ హౌజ్ ను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం సందర్శించారు. పంప్ హౌజ్ ద్వారా నిర్దేశిత గ్రామాలకు రక్షిత మంచినీరు సరఫరా అవుతుందా అని ఆరా తీశారు. పంప్ హౌజ్ కు నీటిని అందించే చెరువును పూర్తి స్థాయిలో నింపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీరు వృధా కాకుండా చూడాలని, ఎక్కడైనా లీకేజీలు ఉంటే తక్షణమే మరమ్మతులు చేపట్టి నివారించాలని సూచించారు. చివరి నివాస ప్రాంతం వరకు కూడా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఎల్ నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి నిల్వలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నందున తాగునీరు వృథా కాకుండా జాగ్రత్తగా వినియోగించాలని హితవు పలికారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అదనపు కలెక్టర్ భుజంగరావు నిజామాబాద్ ఆర్దీఓ రాజేంద్ర కుమార్, ఇంచార్జి డీఈఓ సాయాగౌడ్, టీజీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవీందర్, ఏ.ఈ ఉదయ్, స్థానిక అధికారులు, తదితరులు ఉన్నారు.
    127 Views
  • ఈరోజు సత్యం శివం సుందరం అపార్ట్‌మెంట్‌లో కొలువై ఉన్న శ్రీ దేవి అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఆత్మీయ సత్కారానికి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మవారి దివ్య ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నీ
    నాగోల్ల లక్ష్మీనారాయణ
    19వ డివిజన్ కార్పొరేటర అన్నారు
    117 Views