Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
కర్నూలు జిల్లాలో వైసీపీ-టీడీపీ ఘర్షణ.. ఎమ్మెల్యే విరూపాక్షిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కర్నూలు జిల్లాలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలు ఉద్రిక్తతకు దారితీశాయి. సంగాల, నేమకల్ గ్రామాల్లో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సంగాల గ్రామంలో వైసీపీ నేత గిరితో పాటు ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు నేమకల్ గ్రామంలో టీడీపీ కన్వీనర్ కారును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ ఘటనలతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం శాంతిభద్రతల దృష్ట్యా ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిప్పగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి, ఘర్షణలకు కారణమైన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు. ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.289 Views -
-
-
-
-