చౌడేపల్లి: చౌడేపల్లి మండలంలో మదనపల్లె డివిజనల్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన మండల పరిధిలోని పుదిపట్ల స్వచ్ఛ భారత్ సంకల్పం కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న వర్మీ కంపోస్టు తయారీ విధానం, చెత్త సేకరణ తీరును నిశితంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.
అనంతరం చౌడేపల్లిలోని చెత్త సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న చెత్త సేకరణ...
ఏపీలో ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) అనంతరం దాదాపు 45 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈరోజు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. మరణించిన వారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారి పేర్లను ఈ జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు....
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (ఆగస్టు 1) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీలో సుమారు రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం ప్రధాని షెడ్యూల్ లో కీలకంగా నిలవనుంది. మోదీ పర్యటనకు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)...
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో ఈ ఉదయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరింది. ప్రస్తుతం 9,74,666 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
వరద ఉద్ధృతికి కల్యాణకట్ట, స్నాన ఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి....
గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా షిర్డీ సాయిబాబాకు భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. ఏపీలోని ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు అనే భక్తుడు సాయినాథుడిపై తన భక్తిని చాటుకుంటూ రూ.1.03 కోట్ల విలువైన బంగారు కిరీటాన్ని గురుదక్షిణగా అందించారు. గురు పౌర్ణమి వేళ షిర్డీలో మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో ఈ కానుకను ఆలయ సంస్థాన్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సాయిబాబాను తన...
రాష్ట్రంలో సూపర్ ఎల్‌నినో ప్రభావం వల్ల నెలకొన్న సాగునీటి కొరతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు ఎంతో అమూల్యమైనదని, కాలువల్లో పూడిక తీత, గట్ల లీకేజీల నివారణ వంటి తక్షణ చర్యల ద్వారా నీటి వృథాను అరికట్టాలని పిలుపునిచ్చారు.
డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయనతో...
● లాల్‌దర్వాజా మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణలో పాల్గొన్న సీపీ
● నగర ప్రజలందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు
● లాల్‌దర్వాజా బోనాలకు పోలీసుల పటిష్ట భద్రతా ఏర్పాట్లు
● ఉత్సవాలు ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు ప్రజలకు సీపీ విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 31: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో బాధితుడి కుటుంబాన్ని విస్మరించి, నిందితుడి కుటుంబ సభ్యులను పరామర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఇది పరామర్శ కాదని, నేరపూరిత మనస్తత్వానికి పరాకాష్ట అని లోకేష్ 'ఎక్స్' వేదికగా ధ్వజమెత్తారు.
విచక్షణ ఉన్న ఏ నాయకుడైనా...
● 'డా. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్'గా నామకరణం
● సైనేజీ, అధికారిక వినియోగంలో కొత్త పేరును అమలు చేయాలని ఉత్తర్వులు
● చట్టంలోని సంస్థ అసలు పేరు మాత్రం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టీకరణ
హైదరాబాద్, జూలై 31: సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)కు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెడుతూ తెలంగాణ...