ఏపీలో ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) అనంతరం దాదాపు 45 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈరోజు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. మరణించిన వారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారి పేర్లను ఈ జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు....