Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
కేంద్ర హామీలతో సీజేపీ ఆందోళన విరమణ.. మూడు డిమాండ్లకు అంగీకారం
కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. తమ మూడు ప్రధాన డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మంగళవారంలోపు ఈ హామీలన్నింటినీ లిఖితపూర్వకంగా అందజేస్తామని కేంద్రం భరోసా ఇచ్చినట్లు వెల్లడించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ తొలి విజయమని సీజేపీ పేర్కొంది. అలాగే దేశవ్యాప్తంగా ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయడానికి కేంద్రం అంగీకరించిందని తెలిపింది. భవిష్యత్‌లో కూడా విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించింది.
ఆందోళనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన వారికి, బాధితులకు త్వరలోనే నిబంధనలకు అనుగుణంగా ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్లు సీజేపీ తెలిపింది. ఈ అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ, దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని, నిబంధనలకు లోబడి పరిహారం కూడా అందజేస్తామని వెల్లడించినట్లు సీజేపీ పేర్కొంది.253 Views -