Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి రూ.13 కోట్లు
    హుజూర్నగర్ రూరల్/ భారత్ అవాజ్ :
    తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లను మంజూరు చేసింది.
    ఈ నిధులతో ఆలయ పరిసరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
    అభివృద్ధి పనులు:
    ఆధునిక పర్యాటక సౌకర్యాల ఏర్పాటు
    భక్తులకు వసతి, తాగునీటి, పారిశుద్ధ్య సౌకర్యాలు
    బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి
    సందర్శకుల కోసం ఇతర సౌకర్యాల కల్పన
    మంజూరు చేసిన నిధులతో:
    ఆలయ పరిసరాల అభివృద్ధి
    భక్తుల కోసం మెరుగైన వసతులు
    పర్యాటకులను ఆకర్షించే మౌలిక సదుపాయాల ఏర్పాటు
    ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మట్టపల్లి క్షేత్రం తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం పేర్కొంది
    Like
    1
    604 Views
  • సుల్తానాబాద్ : కారును ఢీకొన్న మినీ ట్రావెల్స్ బస్
    సుల్తానాబాద్ పట్టణంలోని వెంకట స్వామి విగ్రహం వద్ద శుక్రవారం మినీ ట్రావెల్స్ బస్సు బ్రేకులు ఫీల్ కావడంతో ఎదురుగా వెళ్తున్న కారు ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు స్వరూపంగా దెబ్బతిన్నాయి కాగా అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
    470 Views
  • సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి: జేవీవీ రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్
    భారత్ అవాజ్ | హుజూర్‌నగర్   విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్ అన్నారు.   స్థానిక తెలంగాణ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సీహెచ్ రమేష్ అధ్యక్షతన విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలపై అభిరుచి, అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ...
    Love
    1
    558 Views
  • మైనర్లతో వీడియోలు.. రౌడీషీటర్పై కేసు
    డోలపేట ఎస్సీ కాలనీకి చెందిన రౌడీషీటర్ అనిల్ కుమార్ ఎనిమిది మంది మైనర్లతోచట్టవిరుద్ధంగా వీడియోలు చిత్రీకరించి, వాటిని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ వీడియోలు ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో భయాందోళనలు కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో రాజాం పట్టణ ఎస్ఐ ఎం.డి.సల్మాన్ బేగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #Boiena Rajesh
    285 Views
  • రెబ్బెన రైల్వే స్టేషన్ సమీపంలో కలకలం: వృద్ధుడి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
    🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ (రెబ్బెన): కేవలం టీ, మద్యం తాగేందుకు ఇరవై రూపాయలు ఇవ్వలేదనే ఒకే ఒక్క కారణంతో ఒక వృద్ధుడిని భార్యాకూతుళ్ల కళ్లెదుటే గొడ్డలితో తలనరికి కిరాతకంగా చంపిన అమానుష ఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది.అసలేం జరిగింది?ఆసిఫాబాద్ మండలం పర్సనంబాల గ్రామానికి చెందిన మసాడి సోమయ్య (65) అనే వృద్ధ రైతు,...
    396 Views
  • టిఫిన్ దుకాణంలో ఘర్షణ.. పరస్పర కేసులు: ఎస్ఐ
    సంతకవిటి (M) తాలాడలో జరిగిన ఘర్షణ ఘటనపై పరస్పర ఫిర్యాదుల ఆధారంగా 2 కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపాలరావు తెలిపారు. శుక్రవారం టిఫిన్ సెంటర్లో జరిగిన గొడవలో దాలినాయుడిపై దాడి చేశారంటూ ఆయన భార్య సన్యాసమ్మ ఫిర్యాదు మేరకు రాగోలు అభి, రాంబాబులపై కేసు నమోదు చేశారు. మరోవైపు తనపై కులం పేరుతో దూషించి దాడి చేశారని అభి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సన్యాసమ్మ, దాలినాయుడుతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైందన్నారు....
    302 Views
  • లోకల్ Vs నాన్ లోకల్.. విజయనగరంలో వెలసిన ఫ్లెక్సీ
    విజయనగరం కార్పొరేషన్లో స్థానిక ఎన్నికల వేడి మొదలైంది. స్థానికులకే టికెట్లు కేటాయించాలన్న డిమాండ్తో పలు డివిజన్లలో శనివారం ఫ్లెక్సీలు వెలిశాయి. స్థానికేతరులకు టికెట్లు ఇస్తే ఓడిస్తామన్న హెచ్చరికలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో 50 డివిజన్లు ఉండగా తాజాగా ఆ సంఖ్య 64కు పెరగడంతో టికెట్ల కోసం పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో 'లోకల్' నినాదం పార్టీలకు ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది. దీనిపై మీ కామెంట్....
    321 Views
  • గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు నేడు – హుజూర్‌నగర్‌లో కేక్ కటింగ్, మెగా రక్తదాన శిబిరం
    హుజూర్‌నగర్ / భారత్ అవాజ్ :   తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని హుజూర్‌నగర్ పట్టణంలో శనివారం (జూలై 18) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగదీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9:30 గంటలకు హుజూర్‌నగర్ అడ్డరోడ్డులో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం...
    823 Views
  • Ram
    గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు నేడు – హుజూర్‌నగర్‌లో కేక్ కటింగ్, మెగా రక్తదాన శిబిరం
    హుజూర్‌నగర్ / భారత్ అవాజ్ :   తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని హుజూర్‌నగర్ పట్టణంలో శనివారం (జూలై 18) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగదీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9:30 గంటలకు హుజూర్‌నగర్ అడ్డరోడ్డులో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం...
    280 Views